కనుకుంట్ల సంధ్యారాణి కి డాక్టరేట్

 


కిట్స్ వరంగల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్ భాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్  కనుకుంట్ల సంధ్యారాణి కి డాక్టరేట్


 డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ & హ్యుమానిటీస్ (M&H) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెస ర్ గా పనిచేస్తున్న శ్రీమతి కనుకుంట్ల సంధ్యారాణి, కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ డిగ్రీని పొందారు అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు.  


 

 కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సంధ్యారాణి పిహెచ్‌డి పరిశోధనల  థీసిస్‌ను  "ఎ స్టడి ఆన్ ఎస్టిమేషన్ అఫ్ రిలయబిలిటి ఫర్ స్టొకస్టిక్ స్ట్రెస్- స్ట్రెంత్ మోడల్స్"  అనే అంశంపై సమర్పించారని తెలిపారు.  సంధ్యారాణి కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్ గణిత శాస్త్ర విభాగం,  ప్రొఫెసర్, టి. సుమతి ఉమా మహేశ్వరి పర్యవేక్షణలో తన పరిశోధనను  కొనసాగించారని ప్రిన్సిపాల్  పేర్కొన్నారు.

తన పరిశోధన   ప్రస్తుత పని యన్-సైకిల్ సమయం ఆధారిత ఒత్తిడి-శక్తి వ్యవస్థల కోసం విశ్వసనీయతను అంచనా వేయడానికి ఉద్దేశించబడింది. యన్-స్వతంత్ర ఒత్తిళ్లకు లోబడి కాంపోనెంట్ విశ్వసనీయత ఘాతాంక మరియు పారెటో పంపిణీలతో నిర్ణయించబడుతుంది. ఇది సాధారణమైనది, కోన్, వెడ్జ్, వర్టికల్/ఇంక్‌లైన్డ్ ప్లేట్ వంటి జ్యామితిపై వేరియబుల్ హీట్ ఫ్లక్స్ ప్రభావం ను అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు. పరిశోధనా ప్రయాణంలో  ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలలో సాంకేతిక పత్రాలను ప్రచురించారని  తెలిపారు.

ఈ సందర్భంగా కిట్స్ కళాశాల యాజమాన్యం, మాజీ రాజ్య సభ సభ్యులు కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి, ఫార్మర్ హుస్నాబాద్ మాజీ యం యల్ ఏ, కిట్స్ వరంగల్ అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి సంయుక్తంగా గణిత శాస్త్ర రంగంలో మరింత అన్వయించ దగిన సమాజానికి అవసరమైన పరిశోధనలు చేసినందుకు  సంధ్యారాణిని శుభాకాక్షలతో అభినందించారు.

 ఈ  సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం కోమల్ రెడ్డి,  ఎంఅండ్ హెచ్, హెడ్   డాక్టర్ కె. శివశంకర్, పిఎస్  హెడ్ డా. హెచ్. రమేష్ బాబు, వివిధ విభాగాల డీన్ లు అండ్ విభాగాధిపతులు అధ్యాపకులు, సిబ్బంది మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ డి. ప్రభాకరా చారి, పిహెచ్‌డి నీ పొందడం పట్ల సంధ్యారాణినీ  అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు