కిట్స్ అధ్యాపకులు అజ్మీరా శ్రీనివాస్ కు డాక్టరేట్*

 


*కిట్స్ వరంగల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈ సి ఈ)  విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ అజ్మీరా శ్రీనివాస్ కి డాక్టరేట్*


  కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (కిట్స్) వరంగ ల్) డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈ సి ఈ)  విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెస ర్ గా పనిచేస్తున్న  అజ్మీరా శ్రీనివాస్,  డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్, జె యన్ టి యు కె, కాకినాడ  నుండి పీహెచ్‌డీ డిగ్రీ పట్టా పొందారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు. 

  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ  అజ్మీరా శ్రీనివాస్,  పిహెచ్‌డి పరిశోధనల  థీసిస్‌ను "*లెవల్ సెట్ సెగ్మెంటేషన్ ఆఫ్ మామోగ్రం ఇమేజస్ యూజింగ్ కుకు సెర్చ్ బెస్డ్ ఆప్టిమైజేషన్*" అనే వినూత్న సాంకేతిక అంశం పై జె యన్ టి యు కె, కాకినాడ సాంకేతిక విశ్వ విద్యాలయానికి సమర్పించారని తెలిపారు.  



గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలోని ఈ సి ఈ విభాగం ప్రొఫెసర్, డా వి వి కె వి.ప్రసాద్ మరియు జె యన్ టి యు కె ఈ సి ఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.లీలా కుమారి సంయుక్త పర్యవేక్షణలో తన పరిశోధనను విజయ వంతంగా కొనసాగించారని  పేర్కొన్నారు. తన పరిశోధనా ప్రయాణంలో  ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలలో సాంకేతిక పత్రాలను ప్రచురించారని తెలిపారు.

ఈ సందర్భంగా కిట్స్ కళాశాల యాజమాన్యం, రాజ్య సభ మాజీ సభ్యులు కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి గ  హుస్నాబాద్ మాజీ యం యల్ ఏ & కిట్స్ వరంగల్ అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి అజ్మీరా శ్రీనివాస్  శుభాకాక్షలతో అభినందించారు.


 ఈ  సందర్భంగా ఈ సి ఈ  విభాగాదిపతి అండ్ అసోసియేట్ ప్రొఫెసర్, డా.వి.వెంకటేశ్వర్ రెడ్డి, ఈ సి ఈ అకడమిక్ కోఆర్డినేటర్ డా. కె. రాముడు వివిధ విభాగాల డీన్ లు అండ్ విభాగాధిపతులు అధ్యాపకులు, సిబ్బంది మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ డి. ప్రభాకరా చారి, పిహెచ్‌డి నీ పొందడం పట్ల అజ్మీరా శ్రీనివాస్ నీ  అభినందించి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచుకున్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు