బోగత జలపాతం, లక్నవరo, రామప్ప కు సందర్శకులకు నో ఎంట్రీ -కలెక్టర్ దివాకర

 


జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తునందున 

నేపథ్యం లో  జిల్లా లోని   బోగత జలపాతం, లక్నవరo, రామప్ప సరస్సులు తదితర  పర్యాటక

ప్రాంతాలకు సందర్శకుల అనుమతి తాత్కాలికంగా నిలిపివేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  

వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు  ప్రజలు జిల్లాలోని పర్యటక ప్రాంతాలకు రాకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.


జిల్లా లోని మత్స్యకారులందరూ రాగాల  మూడు రోజులు భారీ వర్షాలు కారణం గా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా చేపల వేటకి వెళ్లరాదని,  భారీ వర్షాల సూచన ప్రకారం చేపల వేట నిషేధించబడినదని, ఎవరు కూడా చెరువులు, వాగులు, కాలువులు దగ్గరకు చేపల వేటకి వెళ్లకూడదని, సరదాగా ఈత కొట్టడా నికి గాని వెళ్లకూడదని, చెరువులు, కుంటల దగ్గర చేపల కోసం జాలీలు,  వలలు కానీ అమర్చిన యెడల తక్షణమే వాటిని తొలగించవలసిందిగా  కలెక్టర్ సూచించారు. దీన్ని పాటించని యెడల మత్స్యకారుల యొక్క లైసెన్సు, సంఘాల యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయబడనని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు