_"మోక్ష"మే రక్ష..!

 


*మోక్ష"మే రక్ష..!

నీటిని నిల్వ ఉంచే 

ఎన్నో ప్రాజెక్టులకు 

ఆయన మేధస్సుతో _*మోక్షం*_..

అలా భూమి *_అగ్ని"గుండం"_*

కాకుండా చేయి అడ్డుపెట్టిన

ఆయన యశస్సు అక్షయం..

గంగను భువికి తెచ్చిన భగీరథుడు..

ఆ గంగనే నెత్తిన దాల్చిన విశ్వేశ్వరయ్య..

ఆ ఇద్దరూ ఒక్కరై..

అవ"తరించిన"

మన *_విశ్వేశ్వరయ్య..!_*


జీవిత పర్యంతం 

జలమే బలమై

ఆ జలమే జీవమై..

జలానికి తానే జవమై..

సాగిన మోక్షగుండం జైత్రయాత్ర..

ఇంజనీరుగా..విద్యావేత్తగా

ఆయన బహుపాత్ర..

బహుమతిగా భారతరత్న!


ఎక్కడ పుట్టి 

ఎక్కడికి చేరిన ప్రస్థానం..

పేదరికం నుంచి 

*_మైసూరు రాచరికం వరకు_* 

*_చేర్చిన మేథోత్ధానం..._*

గమ్యం తెలియక..

సౌమ్యం ఎరుగక

పరుగులు తీసే ప్రవాహాలకు

*_నడకలు నేర్పి.._*

*_మలుపులు తిప్పిన శిల్పి.._*

*ఆధునిక భారత* 

*ప్రాజెక్టుల రూపశిల్పి..!*


విద్యాభ్యాసం నాడు 

ఆ మస్తిష్కంలో నాటుకున్న

*_ప్రతి అక్షరం జలాక్షరం.._*

*_పారే నదుల పరవళ్ళే_*

*_ఆయన భాష.._*

ఉరికే జలపాతాల ఉరవళ్ళే

ఆయన గుండె ఘోష..

ఆ భాషకు అర్థం తెలిసి

ఆ ఉరుకుల..పరుగుల 

పరమార్థం ఎరిగి..

జలమే పుడమి వేలుపై

మానవాళి మేలుకొలుపై

నిలిచేలా మలచిన రుషి..

*ఈ గడ్డపై పుట్టిన మహామనీషి!*

మాన్యుడై..ధన్యుడై..

భరతభూమిపై కదలాడే..

కృతజ్ఞతగా ఆయన జయంతి

*ఇంజనీర్స్ డే..!*

**********************

మోక్షగుండం జయంతి

   (15.09.1860) 

సందర్భంగా ప్రణామాలు..

 

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

        విజయనగరం

       9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు