మేడారం తాడువాయి అడవి విధ్వంసం పై జనవిజ్ఞాన వేదిక శాస్త్రీయ అధ్యయనం

 


మేడారం తాడువాయి అడవి విధ్వంసం పై జనవిజ్ఞాన వేదిక శాస్త్రీయ అధ్యయనం చేసి నట్లు జన విజ్ఞాన వేదిక హనుమకొండ కొండ జిల్లా అధ్యక్షులు కె పురుషోత్తం  వెల్లడి

పురుషోత్తం, ధర్మ ప్రకాష్, శ్రీనివాస్ ,నాగేశ్వరరావు, సాజిద్ ల  జన విజ్ఞాన వేదిక పర్యావరణ సబ్ కమిటీ బృందం శాస్త్రీయ నిర్ధారణ కోసం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది 

మేడారం  దారి గుండా కొండేటి వాగు నుండి కొండపర్తి గ్రామం వరకు ఆగస్టు 31వ తేదీన ఐదు నుండి ఏడు గంటల మధ్యలో దట్టమైన మేఘాలతో, ఉదృతమైన గాలులతో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన సమాంతర ఉధృత గాలుల వల్ల సుమారు 100 నుండి 150 హెక్టార్లలో 60 వేలకు పైగా వృక్షాలు నేలకొరిగాయి .

తక్కువ లోతులో విస్తరించిన దట్టమైన అడవిలో , వందల సంవత్సరాల వయసు గల మహావృక్షాలు విస్తరించిన వాటి కొమ్మల వల్ల ఉదృత గాలి, వాన నీటి బరువుకు ఊగి కూకటి వేళ్లతో సహా నేలకొరిగాయి. సన్నగా ఉన్న చెట్లు సగానికి విరిగి తెగిపడ్డాయి .100 సెంటీమీటర్ల చుట్టుకొలత గల పెద్ద వృక్షాలు మాత్రం బరువు ఎక్కువై నేలకొరగాయనిది శాస్త్రీయ అంచనా .ఈ ప్రాంతమంతా ఇసుక నేలలు కావడం అలాగే నాలుగు అడుగుల క్రింద రాతి గుండ్లు ఉండడం వల్ల వేరు వ్యవస్థ సమాంతరంగా వ్యాపించింది . అంకుశం గా ఉండాల్సిన తల్లి వేరు వ్యవస్థ కొద్ది దూరం వరకే పెరగడం మరో కారణం.ముఖ్య విషయమేమంటే ఈ ఉపద్రవం జరిగిన ప్రాంతం చుట్టూ ఉన్న కామారం ,మేడారం, ఊరటం , కొండపర్తి గ్రామాలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదంటే దానికి కారణం అడవి తనకు తానుగా ధ్వంసం అయి ఆ గ్రామాలను కాపాడింది అని చెప్పవచ్చు.

ఈ ప్రాంతంలో కేంద్ర వాతావరణ శాఖ తమ పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ముందే శాస్త్రీయంగా అంచనా వేసి తగు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వ అటవీ శాఖ పడిపోయిన చెట్లను లెక్కిస్తూ సత్వర సంరక్షణ చర్యలు చేపట్టాలని జనవిజ్ఞాన వేదిక బృందం అభిప్రాయపడింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు