_ఆంధ్ర తొలి రాజకీయ ఖైదీ_
_గాడిచర్ల సర్వోత్తమరావు_ _జయంతి..14.09.1883_
______________________
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
9948546286
✍️✍️✍️✍️✍️✍️✍️✍️
*_తెల్లోళ్ళ ఏలు"బడి"లో_*
*_తరగతి గదిలో_*
*_వందేమాతరం.._*
*_అదెవరి తరం.._*
బిపిన్ చంద్ర ప్రసంగాలతో
రగిలిన స్ఫూర్తి
దారితీసింది
*_కళాశాల బహిష్కరణకు.._*
*_లేతప్రాయంలోనే స్వరాజ్య_*
*_సమరాంగణమునకు..!_*
క్లాస్ రూములో వందేమాతరం
బ్యాడ్జి ధరించిన దేశభక్తికి
పరాయి పాలకులిచ్చిన
నజరానా..
సర్కారీ కొలువులకు అనర్హత..
నాకే వద్దులే ఉద్యోగమన్న
*_భారతీయ పౌరుషం_*
*_పట్టింది పెన్ను.._*
*_తెల్లోడి అక్రమాలపై_*
*_పేలిన గన్ను..!_*
పోలీసు కాల్పుల్లో
ముగ్గురు మరణిస్తే
మరిగిపోయిన
సర్వోత్తమరావు కలం
బ్రిటిష్ రూలుకు నిరసనగా
విదిలించింది జూలు..
*_క్రూరమైన విదేశీ పులి_*
సంపాదకీయం
పంపింది జైలుకు..
*_ఆంద్రులలో_*
_*తొలి రాజకీయ*_
*_ఖైదీ హోదా.._*
*_జాతి మొత్తం గాడిచర్ల_*
*_తెగువకు అయింది ఫిదా!_*
నెల్లూరు చెరసాలలో
బందిపోట్ల నడుమ ఆటుపోట్లు..
పెరిగింది తెగువ..
తిలక్ పిలుపుతో
హోం రూల్ ఉద్యమం..
హిందుస్తానీ సేవాదళ్
నాయకత్వం..
పెంచింది మరింతగా
*_పోరాడే తత్వం..!_*
పత్రికను నడిపే సారధి
ఎడిటర్ కాదు
సంపాదకుడని పేరు..
అదే సర్వోత్తమరావు తీరు!
బాపూనే విమర్శించి
అదే బాపూ నుంచి
*_ది బ్రేవో సర్వోత్తమరావు_*
అని ప్రశంసలు
అందుకున్న ధీశాలి..
కాళోజీనే మెప్పించి..
_వందేమాతరమనగనే_
_వచ్చి తీరునెవని పేరు..?_
_వయోజన విద్య అనగనే_
_వచ్చి తీరునెవని పేరు?_
_గ్రామగ్రామమున వెలసెడి_
_గ్రంధాలయమెవనికి గుడి_
_అరగని తరగని వొడవని_
_అక్షరదానంబెవడిది..?_
_ఏ స్థాన కవినో నేను_
_ఆస్థానాధీశుడెవడు?_
_హరి సర్వోత్తముడాతడు_
_ఆంధ్రుల పాలిటి దేవుడు!_
ఇది చాలదా గాడిచర్ల
ఘనతకు గురుతు..
వెరపు లేని ధైర్యమే షరతు!!
************************
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box