మొదటి రోజు ముగిసిన 16వ కేంద్ర ఆర్థిక సంఘం సమావేశాలు

 


మొదటి రోజు ముగిసిన 16వ కేంద్ర ఆర్థిక సంఘం సమావేశాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 09  ::  కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం నేడు ప్రజాభవన్ లో పలు సంస్థలు రాజకీయ పార్టీలు స్థానిక సంస్థలు వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులతో విస్తృత స్థాయిలో సమావేశం అయ్యింది. నేడు ఆర్థిక సంఘం చైర్మన్ డా. అర్వింద్ పనగారియా, సభ్యులు అజయ్ నారాయణ్ జా, అన్నీ జార్జ్ mathew, డా. మనోజ్ పాండా, సౌమ్య కాంతి ఘోష్, సంఘం కార్యదర్శి రిత్విక్ పాండే ల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపాలిటీల మేయర్లు చైర్మన్ లతో ముందుగా సమావేశమైంది. అనంతరం గ్రామపంచాయతీల మాజీ సర్పంచులు, జడ్పిటిసిలు, ఎంపీపీలతో,  రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సంఘ సభ్యులతో అధికారులతో సమావేశమైంది. వ్యాపార వాణిజ్య సంస్థలైన  అలీఫ్, ఫిక్కీ, సి.ఐ.ఐ ప్రతినిధులతో సమావేశం జరిగింది. 

సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కేంద్ర ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సిరిసిల్ల రాజయ్య, టి రామ్మోహన్ రెడ్డి, బిజెపి పార్టీ నుండి ఈటల రాజేందర్, కాసం వెంకటేశ్వర్లు, ప్రకాష్ రెడ్డి,  బిఆర్ఎస్ నుండి టి హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద, సిపిఎం నుండి నంద్యాల నరసింహారెడ్డి, టిడిపి నుండి సామా భూపాల్ రెడ్డి, ఎన్ దుర్గాప్రసాద్, బీఎస్పీ నుండి జనత్ కుమార్, బి ఈశ్వర్, ఎంఐఎం పార్టీ నుండి అక్బరుద్దీన్ ఓవైసీ, సయ్యద్ అమీన్ జాఫ్రీ,  అహ్మద్ బలాల, ఆమ్ ఆద్మీ  పార్టీ నుండి సుధాకర్, బుర్ర రేణు గౌడ్, అబ్బాస్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

------ends

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు