దుర్గం గుట్టపై కాకతీయుల రాతి కట్టడాలు



*దుర్గం* *గుట్టపై*  *కాకతీయుల* *రాతి*  *కట్టడాలు*  అద్భుతం :: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.          

                                                             *******

దట్టమైన అటవీ ప్రాంతం లో  దుర్గం గుట్ట పై ఉన్నా కాకతీయుల భారీ రాతి కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అన్నారు.


శుక్రవారం గోవిందరావుపేట్ మండలం  దట్టమైన అడవిలో ఉన్న దుర్గం గుట్టను జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి సందర్శించారు.          


జిల్లా కలెక్టర్ దట్టమైన అటవీ ప్రాంతం లో ట్రేకింగ్ చేస్తూ దుర్గం గుట్టపై ఉన్న కాకతీయుల భారీ రాతి కట్టడాలను పరిశీలించారు. దుర్గం గుట్ట ప్రాముఖ్యత రాతి కట్టడాల చరిత్ర అటవీ విస్తీర్ణం పలు అంశాలను జిల్లా కలెక్టర్కు అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ యాదవ్ కులంకషంగా వివరించారు. 

అనంతరం తాడ్వాయి మండలంలోని బ్లాక్ బెర్రీ ఐలాండ్ పర్యాటక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి సందర్శించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుర్గం గుట్ట మరియు బ్లాక్ బెర్రీ ఐలాండ్ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని , ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం సెల్ఫీ పాయింట్స్, దుర్గగుట్ట చుట్టూ పై భాగం లో రైలింగ్ ఏర్పాటు చేయాలని , బ్లాక్ బెర్రీ ఐలాండ్ లో పర్యాటకుల ఆటవిడుపు కోసం పలు క్రీడా అంశాలను ఏర్పాటు చేయాలని , చరిత్ర పర్యాటకులకు వివరించేందుకు గైడ్ ను ఏర్పాటు చేయాలని , క్లాక్ టవర్ వెళ్లే మార్గంలో చెక్కతో చేసిన మెట్లను అమర్చాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. 

జిల్లా కలెక్టర్ క్లాక్ టవర్ పైభాగం నుంచి చుట్టూ అటవీ అందాలను తిలకించారు. 


ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు