డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు అరుదైన గౌరవం
నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం
ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు.. మెక్సికో దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును నిర్వాహకులు ఆహ్వానించారు. ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ 200 వ వేడుకలో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదుల సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ఆహ్వానంలో తెలిపారు. ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box