*
_అద్భుతం ఆయన గొంతు.._*
*_ప్రశ్నించడమే దాని వంతు..!_*
_(సీతారాం ఏచూరికి_
_అక్షర నివాళి)_
తిరగబడే గొంతు మూగబోయింది..
నిజానికి అది వాణి కాదు..
అనర్గళంగా మాటాడ్డం
ఆయన బాణి..
తోచింది చెప్పడం కాదు..
తాను ఆలోచించి..
నిన్ను ఆలోచింపచేసే
ప్రసంగాలు...
ఆయన నిత్య వ్యాసంగాలు..
*_సీతారాం ఏచూరి.._*
పద విన్యాసాల రణభేరి..
అవతల ప్రధాని ఉన్నా..
ప్రెసిడెంటే కూర్చుని ఉన్నా
హోరాహోరి..
ప్రణబ్ ముఖర్జీ
ప్రసంగానికీ సవరణ..
మోడీ ఇరకాటంలో..
ఏచూరి తీర్మానం
అదరహో..!
ప్రజాసమస్యల ప్రస్తావన కోసం
పార్లమెంటు ప్రతిష్టంభన..
ఇదే ఏచూరి మదింపు..
మాట్లాడితే గుక్క తిప్పక
విమరనాస్త్రాల సంధింపు..
అనుకున్నది మాటలతోనే
సాధింపు..ప్రతి పలుకు ఇంపు!
అమెరికా విధానాలు కిట్టని
నిఖార్సయిన కమ్యూనిస్టు..
అగ్రరాజ్యం ఆధిపత్య పోకడలపై ఎన్ని వాగ్బాణాలు..
గణతంత్ర వేడుకలకు
బ"రాక" ఒబామాను
వ్యతిరేకించిన స్థితప్రజ్ఞత..
ఏచూరి సీతారాం ప్రత్యేకత..!
(నేను విన్నాను
ఆయన ప్రసంగాలు చాలా..
ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు
ఆయన పరిజ్ఞానాన్ని
గమనించి అబ్బురపడ్డాను..
చక్కని భాష...
ఇంగ్లీషైనా..తెలుగైనా
స్పష్టమైన ఉచ్చారణ..
విషయాలపై పరిపూర్ణ అవగాహన..
ముక్కుసూటిగా చెప్పే స్వభావం..
A complete and competent communist
Leader..)
*Kudos*
_లాల్ సలాం సీతారాం ఏచూరి_
*_సురేష్ కుమార్,జర్నలిస్ట్_*
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box