ఆపద సమయంలో స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు రావాలి :: జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్.
ఆర్ డి టి సంస్థ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ.
****
ఆపద సమయంలో స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు.
మంగళవారం తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో వర్షాల ద్వారా నష్టపోయిన 16 కుటుంబాలకు టార్పాలిన్ , 14 రకాల నిత్యవసర సరుకులను జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆర్ డి టి సంస్థ ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆపద సమయంలో సహాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని వారికి ప్రోత్సాహం అందించడం జరుగుతుందని తెలిపారు. తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రెండు రోజులు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న 16 గృహాలకు వారి కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని త్వరలోనే ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల స్పెషల్ ఆఫీసర్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ అలెం అప్పయ్య, స్థానిక తహసిల్దార్ రవీందర్ , ఆర్ డి టి సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box