హైదరాబాద్ HICC లో AI గ్లోబల్ సమ్మిట్ 2024 కార్యక్రమం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఐటీ పరిశ్రల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వివిధ దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో వివిధ దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఇవాళ,రేపు రెండు రోజులపాటు కొనసాగనున్న AI గ్లోబల్ సమ్మిట్ ను “Making AI work for every one'' అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు.
తొలిసారిగా హైదరాబాద్ లో AI గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ లో AI రోడ్ మ్యాప్ ను విడుదల చేసారు.
రోడ్ మ్యాప్ లో 25 కార్యక్రమాలను ప్రభుత్వం పొందుపరిచింది.
*AI గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదన్నారు.
మొదటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారిందని విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయిందని ఉదాహరించారు.
ఇదే క్రమంలో కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ - ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయన్నారు ముఖ్యమంత్రి.
టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ చూడటం మన తరం చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు.
ఇవాళ ప్రపంచ సాంకేతికరంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సని ముఖ్యమంత్రి అన్నారు.
కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొంత భయం నెలకొంటుందని అది మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది.. అదే సమయంలో ఉద్యోగాలు పోతాయా అనే భయం ఉండటం సహజ మని అన్నారు.
దేశ చరిత్రను పరిశీలిస్తే.. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని సరిగ్గా అనుసరించలేకపోయామని అన్నారు.
భారతదేశ భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే.. హైదరాబాద్ సిటీలా మరే సిటీ పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణంగా సిద్ధంగా లేదు అని ఇందుకు సంబంధించిన సవాళ్ళను స్వీకరించడమే కాదు... భవిష్యత్తును సృష్టిస్తామని ముఖ్య మంత్రి ధీమా వ్యక్తం చేసారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు.
ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చాలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఈ రంగంలో మన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నామని కూడ సీఎం స్పష్టం చేసారు.
తెలంగాణ AI మిషన్, లేదా NASSCOM భాగస్వామ్యంతో T-AIM తెలంగాణలో AI ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడంలో సహకరిస్తాయని తెలిపారు.
ఇండస్ట్రీ నిపుణులతో కలిసి ఆవిష్కరణలను ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని హైదరాబాద్ ను AI హబ్ గా తీర్చిదిద్దబోతున్నామనేందుకు ఈ సదస్సు నిదర్శనమని పేర్కొన్నారు.
సిటీ ఆఫ్ ది ఫ్యూచర్‌కి మీ అందరికి స్వాగతం అంటూ మనమందరం కలిసి ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప AI హబ్ గా తీర్చిదిద్ధే సంకల్పంతో భాగస్వాములు కావాలంటూ పిలుపునిచ్చారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box