ఆయన లక్ష్యo అంతరిక్షం..

 


ఆయన లక్ష్యo అంతరిక్షం..!


(భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు విక్రం సారాభాయి జయంతి)

      12.08.1919

'______________________


*_(సురేష్..9948546286)_*


✍️✍️✍️✍️✍️✍️✍️✍️


విక్రం సారాభాయి

అంతరిక్షంపైనే 

సదా ఆయన కనుదోయి..

ఆకసంలో ఎగరాలి నిత్యం

మువ్వన్నెల జెండా..

అదే ఆయన జీవితకాలపు

అజెండా..!


పుట్టింది సంపన్నకుటుంబమే..

అయినా ఖాందాన్లో 

చెక్కుచెదరని

స్వరాజ్య కాంక్ష..

గాంధీ..నెహ్రూలు

ఆ ఇంట వచ్చిపోయే అతిథులు..

మహనీయుల మాటలే

విక్రంభాయి జీవిత పాఠాలు..

భౌతికశాస్త్రం లోతుపాతులు

కంఠోపాఠాలు..!


కేంబ్రిడ్జిలో విద్యకి 

ప్రపంచయుద్ధం కారణంగా 

పడినా బ్రేకు..

మళ్ళీ కొనసాగించి 

సాధించలేదా డాక్టరేటు..

ఎక్కడైనా భౌతిక శాస్త్రమే 

సారాభాయ్ ఫేవరేటు..!


ఆయనలోని కళాపిపాస

చేసింది కళాకారిణి 

మృణాళినిని జీవిత సహచరిగా 

కూతురు తల్లి బాటలో..

కొడుకు తన మార్గంలో..

అలా అయింది వారిల్లు 

కళానిలయం..

ఆపై పరిశోధనాలయం..!


సివి రామన్ శిష్యరికంలో..

హోమీ బాబా సాహచర్యంలో

అంతరిక్ష పితామహునిగా

విక్రం భాయి గమనం

ఎన్నో అవార్డులు బహుమానం..

విజయాలే కొలమానం..! 


శాస్త్రవిజ్ఞానం మానవాళి

ప్రయోజనాల కోసమేనని నమ్మి

ఆ క్రమంలోనే సాగించి శోధన..

విజయాల సాధన..

సారాభాయి జీవితంలో

పరిశోధనలే సదా

అలా అంతరిక్షమే అయింది

ఆ మహాశాస్త్రవేత్తకు ఫిదా..!


👍👍👍👍👍👍👍👍

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు