_అదిగో నవలోకం

 


*_అదిగో నవలోకం..!_*

  (వీరాభిమన్యు @ 60)

*_(సురేష్..9948546286)_*


శోభన్ బాబా..చంద్రమోహనా..

హర్నాధా.. కృష్ణంరాజా..

ఒకే ప్రశ్న..ఒకే సమాధానం..

సోగ్గాడు శోభన్ బాబు..

అంతకు చాలా ముందే 

అయ్యాడాతడు 

అభిమన్యు..

అంతవరకు సైడ్ యాక్టర్..

ఆ సినిమాలో 

మరణించి 

అయ్యాడు హీరో

అందాల నటుడి 

జీవితంలో 

టర్నింగ్ పాయింట్..

అంతకు ముందు 

గూఢచారి 116 

హీరో ఛాన్స్ మిస్సయిన 

లోటు భర్తీ..

అప్పటినుంచి 

ఉప్పు శోభనాద్రి జబర్దస్తీ..!


ఎన్టీఆర్..కాంతారావు...

రాజనాల..ధూళిపాళ..

హేమాహేమీల 

నడుమ శోభన్

టైటిల్ రోల్..

నర్తనశాల నాటి అనుభవం..

సూపర్ హిట్ సంభవం..

పేరులోనే విక్టరీ..

హిట్ సినిమాల ఫ్యాక్టరీ..

మధుసూధనరావు ఉంటే 

కాంచన ఖాయం..

ఆమె నవలోకంలో ..

ప్రేక్షక లోకం ఆ మైకంలో..!


కళ్లకు కట్టినట్టు 

భారతంలో 

కొన్ని సన్నివేశాలు..

కళ్లకు నిండుగా..

కనులు పండగా కిట్టయ్య 

విశ్వరూప సన్నివేశాలు..

కురుసభలో ఆవేశాలు..

పార్ధుడికి రంగుల్లో దర్శనం..

రవికాంత్ నగాయిచ్ 

ప్రతిభకు నిదర్శనం..!


మాయాబజార్ ఎస్వీఆర్ 

అంతకాకపోయినా 

అదరగొట్టిన 

నెల్లూరు కాంతారావు

భారీ రూపం..

ఘటోత్కచుడి పటాటోపం..

విరాటుడి బుల్లి భటులు..

కుప్పకూలిన భవంతులు..

చూస్తే వింత..

తలచుకుంటే పులకింత..!


సరే..కృష్ణుడు ఎన్టీఆర్..

చెప్పేదేముంది..

కొట్టిన పిండి..

నట విశ్వరూపం..

రూపు సమ్మోహనం..

అంతకు ముందు 

రామారావు వేసిన 

బృహన్నల...

అందులో కాంతారావు 

సగం వెన్నెల..

ఎందరున్నా వీరాభిమన్యు

శోభన్ సినిమా..

ఆయన రూపం..అభినయం..

ఆహార్యం..మరణం..

ఎన్నిసార్లు చెప్పినా

కాబోదు చర్వితచర్వణం..

ఇంద్రుని,చంద్రుని అందాలు

ఈతని సొమ్మే కాబోలు..

మౌనముగానే మనసును దోచే

మన్మధుడితడే కాబోలు..

అవే మాటలు..

నిజాల మూటలు..

అందంతోనే ఏలాడు

చిత్రసీమను..

అభిమన్యుడయ్యాడు 

అభినవ హీమాన్!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు