నీ కోసం..!ఆమె..చీర కడితే అజంతా శిల్పం...



 *_నీ కోసం..!_*

ఆమె..చీర కడితే 

*_అజంతా శిల్పం.._*

పొట్టి పావడా తొడిగితే

పదహారణాల పల్లె పడుచు..

పేంటు..కోటు సింగారిస్తే

ఏయ్..ఘోడా అంటూ

గీర చూపులతో 

అదరగొట్టే వాణి..

పైన కొప్పు బిగిస్తే 

*_ఎయిర్ హోస్టెస్.._*

మురిపాల *_లత.._*

పొగరుబోతు *_సెక్రెటరీ.._*

*_కడవెత్తుకొచ్చే కన్నెపిల్ల.._*

*_పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల_*

బుల్లి మోటార్ సైలెక్కితే

*_మనసైన చిన్నది.._*

రేడియోలో పాడితే

*_ముందే కూస్తుంది కోయిల.._*

ఘటం ధరిస్తే *_మొల్ల.._*

వయసు మళ్లీనాక

మెగాస్టార్..నాగ్..

బొబ్బిలి రాజాలకు 

సరితూగే అత్త..

ఇలా ఎన్నని చెప్తే 

పండుతుంది _*వాణిశ్రీ*_ కథ..

*మరపురాని కథ..!*


అభినేత్రి..సావిత్రి తర్వాత

అంతటి ప్రియధాత్రి..

ఎన్టీఆర్..ఏయెన్నార్..

కృష్ణ..శోభన్..

ఊపు మీదున్న రోజుల్లో

నాయికకు 

అసలైన రూపు..

కోర చూపు..

పొగరుబోతు నాయిక..

తెలుగు సినిమా 

తిరుగులేని ఏలిక..

*_అభిసారిక!_*


సావిత్రి..అంజలి..జమున..

ఈ జమానా ముగుస్తుండగా

జయసుధ..ప్రద..శ్రీదేవి..

హవాకు శ్రీకారం...

ఆ నడుమ *_వాణిశ్రీ యుగం..._*

ఆమె పాడిందే రాగం..

వేసిందే గంతు..

గమ్మత్తైన గొంతు..

*_మహానటి బిరుదు_* 

*_ఆమె వంతు!_*


పొగరుబోతు శోభన్ తో

జతకట్టినా

నిజానికి పొగరుబోతు పిల్ల

పాత్రలకు వాణిశ్రీ 

పెట్టింది పేరు

ఆత్మగౌరవం ఇంటి పేరు

ఆత్మాభిమానం పాత్ర తీరు...

అన్నట్టు సాగింది నట తేరు..!

*_లత..రాధ..జయంతి.._*

ఏ పాత్ర వేసినా 

ఇట్టే నచ్చేసే ముద్దబంతి 

అదో ప్రేమలోకం..

*_చక్రవాకం.._*

రాసే కొద్ది 

ఇంకా రాయాలన్న మైకం..

వాణిశ్రీ అభినయం..

అసామాన్యం..

అనితరసాధ్యం..!

_______________________

అభినేత్రి వాణిశ్రీ జన్మదినం

(3 ఆగస్టు..1948)

సందర్భంగా

అభినందనలతో..

🎂🎂🎂🎂🎂🎂🎂

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

         9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు