సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం

 



తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సెక్రటేరియట్ ఆవరణను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 


డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...


తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార పీఠమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని,  అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన సీఎం.


రాజీవ్ గాంధీ జయంతి వేడుకలలో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి....


ఇందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సచివాలయ ఆవరణను పరిశీలించిన సీఎం.


విగ్రహ ఏర్పాటు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించిన సీఎం.


తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించిన సీఎం.


పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు