కిట్స్ కళాశాలలో ప్రారంభమైన 24 గంటల "నాసా స్పేస్ ఆప్ హాకథాన్

 


కిట్స్ కళాశాలలో   ప్రారంభమైన 24 గంటల "నాసా స్పేస్ ఆప్ హాకథాన్

కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నాసా స్పేస్ ఆప్ హాకథాన్ ప్రారంభించారు. 

అంతరిక్ష పరిశోధనల మీద విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను మేల్కొల్పి వారిని స్పేస్ సైంటిస్టులుగా తీర్చిదిద్ది  అంతరిక్ష  పరిశోధన రంగంలో ఉన్న ఇన్నోవేషన్ అవకాశాల మీద అవగాహన కల్పించి ప్రపంచ అంతరిక్ష శాస్త్ర సాంకేతిక రంగాల్లో సవాళ్లకు విద్యార్థుల చేత వివిధ రకాల పరిష్కారాలు కనుగొనే దిశగా నాసా స్పేస్ ఆప్ హాకథాన్ ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక రెడ్డి తెలిపారు.


చంద్రయాన్-3 విజయవంతానికి గుర్తుగా భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా వరంగల్ నగరంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ 24 గంటల నాసా స్పేస్ ఆప్ హాఖాతాన్  ప్రారంభించడం ఒక మంచి పరిణామం.

 ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తి చూపే విధంగా ఈ హాకథాన్ ప్రారంభించారు. ఇందులో 120 మంది విద్యార్థులు 24 గ్రూపులుగా పాల్గొని అంతరిక్ష పరిశోధనలో ఉన్న సవాళ్లు మరియు అవకాశాలకు అనుగుణంగా పరిష్కారాలను చూపెట్టే విధంగా ప్రజెంటేషన్స్ రూపొందించడం జరిగింది. 


ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలై మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నిరాటంకంగా సాగుతుంది. అనంతరం కార్యక్రమంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాల పట్ల ప్రజెంటేషన్, సొల్యూషన్స్ రూపొందించిన వారిని విజేతలుగా ఎంపిక చేస్తారు. అంతేకాకుండా ఈ విజేతలకు చండీగఢ్ యూనివర్సిటీలో జరిగే జాతీయ హాకథాన్ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. అంతరిక్ష పరిశోధనలో ఉన్న అవకాశాలను విద్యార్థులకు తెలియజేసి వారిని అత్యుత్తమ అంతరిక్ష సైంటిస్టులుగా తీర్చిదిద్దడానికి మరియు నాసా, ఇస్రో వంటి సంస్థల్లో జరుగుతున్న పరిశోధనల పట్ల కూడా అవగాహన కలగడానికి ఈ హాకథాన్ ఎంతో ఉపయోగపడుతుంది. 

 


ఇంజనీరింగ్ విద్యార్థి దశనుండే అంతరిక్ష పరిశోధనలో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను  దృష్టిలో పెట్టుకొని వాటికి దీటుగా ఇంజనీరింగ్ విద్యార్థులను తీర్చిదిద్దే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి వెబ్ అప్లికేషన్స్,  గేమింగ్ , డేటా సైన్స్, సెన్సార్ టెక్నాలజీ, రోబోటిక్స్ వంటి అంశాల్లో విద్యార్థులు ఈ సందర్భంగా తమ పరిశోధనలను ప్రదర్శించడం జరిగింది. 


SUMVN సంస్థ - ఐ స్క్వేర్ ఆర్ ఈ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె. అశోక రెడ్డి, ఐ స్క్వేర్ ఆర్ఈ హెడ్ డాక్టర్ రాజా నరేందర్ రెడ్డి, డాక్టర్ రాజు రెడ్డి, SUMVN సంస్థ ప్రతినిధులు కట్టపల్లి సాయికిరణ్, వెంకట్ సాయి, ఫౌండర్స్ లాబ్ సంస్థ డైరెక్టర్ సత్య ప్రసాద్ పెద్దపెల్లి మరియు ఇతర ఫ్యాకల్టీ బృందం పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు