రీఇమాజినింగ్ హైదరాబాద్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .
పాలకులు, ప్రభుత్వాలు మారినా.. చారిత్రక హైదరాబాద్ నగర అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను కొనసాగించారని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హోటల్ కోహినూర్ లో గురువారం రాత్రి CREDAI ఆధ్వర్యంలో రీఇమాజినింగ్ హైదరాబాద్ కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, CREDAI ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్అం రెడ్డి మాట్లాడుతూ అందరి కృషివల్లే ప్రపంచంలోనే హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు వచ్చిందన్నారు.
"ఫార్మా రంగంలో హైదరాబాద్ దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.
1965లో పాలకులు తీసుకున్న నిర్ణయాల ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం.
ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం 25ఏళ్ల క్రితం అటవీ ప్రాంతం.
కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నామా.. ఇంకెక్కడైనా ఉన్నామా అని అనిపిస్తుంది "అన్నారు.
"హైదరాబాద్ 4.0 అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం...
ఇవాళ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రాంతం బ్యాగరి కంచె..
ఆ పేరు పలకడానికి కొందరు ఇబ్బంది పడొచ్చు...
కానీ ఒకప్పుడు బంజారాహిల్స్ ను కూడా అలాగే అనుకునేవారు..
మరో నాలుగైదేళ్ళల్లో బ్యాగరి కంచె గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి అభివృద్ధి చేస్తాం..
మూసీ రివర్ డెవలప్మెంట్ తో ఇక పెట్టుబడులంటే హైదరాబాద్ గుర్తొచ్చేలా చేస్తాం
సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్ లతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం..
మూసీలో కలుషితం లేని నీటి ప్రవాహం ఉండేలా అభివృద్ధి చేస్తాం.
మరో ఏడాదిలోగా మాస్టర్ ప్లాన్ 2050 అందుబాటులోకి రాబోతుంది.
ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉంది..
కొందరితో సిద్ధాంత పరంగా విభేదాలున్నా.. తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకు ఎలాంటి విభేదాలు లేవు"అని పేర్కొన్నారు.
బిల్డర్స్ రాజకీయ నాయకులుగా మారితే.. మేం వారిని ప్రత్యర్థులుగానే చూడాల్సి వస్తుందని సీఎం అన్నారు.
వ్యాపారాలు మాత్రమే చేస్తే ప్రభుత్వం వారికి సహకరిస్తుంది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box