ముందు గన్నులు...ఇప్పుడు పన్నులు..!



 *_ముందు గన్నులు.._*

*_ఇప్పుడు పన్నులు..!_*


(హ్యాపీ బర్త్ డే నిర్మలా జీ..)


💐💐💐💐💐💐💐


ఆమె నిర్మలంగా బాదేస్తుంది..

సభల్లో కమలం తరపున

వకాల్తా పుచ్చుకుని 

విపక్షాలను ఉతికి ఆరేస్తుంది..

బడ్జెట్లు ఆమె చేతి గాడ్జెట్లు..

పన్నులు విధించేస్తుంది

సచిన్ రన్నులు 

చేసినంత వీజిగా..

వరసగా ఏడు బడ్జెట్లు ఇచ్చేసింది

ఎంతో క్రేజీగా..!


నిర్మలా సీతారామన్..

తమిళనాట పుట్టి..

పరకాల వారిల్లు మెట్టిన

ఈ బీబీసీ ఉద్యోగి..

రక్షణ శాఖ మంత్రిగా చెలరేగి..

ఇందిరమ్మ తర్వాత 

అంత పెద్ద పదవిని 

చేపట్టిన మహిళ...

మోడీ మంత్రివర్గానికి 

ఒక సరికొత్త కళ..!


ఏడేళ్లుగా విత్తు మంత్రి..

పన్నులకి కొత్త భాష్యం చెప్పే

ఆ"ధనిక" కవయిత్రి..

దేశం ఎలా ఉన్నా

మోడీ ప్రేరణతో 

ఆమెనూ మెచ్చింది ధరిత్రి..

ఆమె విధానాలతోనే 

నానాటికీ బలపడుతోంది

అంబానీ..అదానీలతో

మోడీజీ మైత్రి..

విదేశీ బ్యాంకుల్లో

భారతీయుల నల్లసొమ్ము

పదిలంగా ఉంటే..

ధరల భారంతో సామాన్యుడి 

ఇంట ప్రవహిస్తోంది

కన్నీటి గంగోత్రి..!

సాధించింది తక్కువైనా

ఘనవిజయాలన్నట్టు

డంబాలు పలికే

ఆర్థిక అభినేత్రి..

పన్నుల త్రినేత్రి..!!


✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽


*_సురేష్. 9948546286_*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు