కిట్స్ వరంగల్ లో 132 వ జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవం

 


కిట్స్ వరంగల్ లో 132 వ జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవం

సెంట్రల్ లైబ్రరీ, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ (కిట్స్ డబ్ల్యు) లో గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డా. యస్. ఆర్. రంగనాధన్ గారి 132వ జయంతి ని పురస్కరించుకుని జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవం నిర్వహించారు.

 కిట్స్ కాంపస్  సెంట్రల్ లైబ్రరీ లో   డా. యస్. ఆర్. రంగనాధన్ చిత్రపటానికి పూల మాల వేసి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీన్ అకాడెమిక్ అఫైర్స్,  ప్రొఫెసర్‌ కె.వేణుమాధవ్‌ మాట్లాడుతూ గ్రంధాలయం నేర్చుకోవడానికి, నైపుణ్యాభివృద్ధికి ఒక అపూర్వ దేవాలయమని  అన్నారు. నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్, గ్రంథాలయాలు లేకపోతే విద్యాసంస్థల అభివృద్ధి, భవిష్యత్తు లేవన్నారు. పుస్తకం అనేది మీ కుర్చీని వదలకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి మిమ్మల్ని అనుమతించే ఒక అద్భుత విషయన్నారు. లైబ్రరీ వినియోగదారుల అంచనాలను అందుకోవడానికి  తాజా ఐ సి టి మరియు డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించి వారికి సమర్థవంతమైన లైబ్రరీ సేవలను అందించడానికి తమను తాము అప్‌డేట్ చేసుకోవాలని లైబ్రరీ నిపుణులకు  సూచించారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తున్న లైబ్రరీ సిబ్బంది ని ప్రశంసించారు.  



 రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం. కోమల్‌రెడ్డి మాట్లాడుతూ నూతన సాంకేతిక పోకడలను దృష్టి లో పెట్టుకొని కిట్స్ యాజమాన్యం  40 లక్షల రూపాయల విలువైన పుస్తకాలను  ఈ- జర్నల్స్ ను 2024- 25 అకాడెమిక్ విధ్యార్ధులకు, అధ్యాపకులకు సమకూర్చారని తలిపారు. వీటిని ఉపయోగించడం వలన సమాజ హిత సాంకేతిక పరమైన ప్రాజెక్టు లను రూప కల్పన చేస్తున్నారని తెలిపారు.  

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పుస్తకాలను పత్రికలను సమాచారానికి సంబంధించిన సేవలను సరియైన సమయంలో అందించాలన్నారు. రంగనాథన్ గ్రంథాలయ శాస్త్రానికి చేసిన సేవలను కేంద్ర  ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందన్నారు.  గ్రంధాలయం విద్యార్థులకు, అధ్యాపకుల ప్రయోజనం కోసం రిమోట్ యాక్సెస్‌ సౌకర్యం కూడా కల్పిచామని  తెలిపారు. 


కిట్స కళాశాల  ప్రిన్సిపాల్ అశోకారెడ్డి మాట్లాడుతూ లైబ్రరీలు, డిజిటల్ లైబ్రరీలు ప్రస్తుత సాంకేతిక విధ్య లో వినూత్న ఆవిష్కరణలకు ముఖ్య భూమిక పోషిస్తాయని  ప్రిన్సిపాల్   ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి అన్నారు.


ఈ కార్యక్రమంలో డీన్లు, వివిధ విభాగాల అధిపతులు, ఈ. ఐ.ఈ.  విభాగపు ప్రొఫెసర్ మరియు గ్రంధాలయ కమిటి చైర్ పర్సన్ ప్రొఫెసర్ యం. శ్రీలత, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ మరియు పి. ఆర్. ఓ. డా. డి. ప్రభాకరా చారి, యం. నిరంజన్, యం. అరుణ్, పి. సుమలత, టి. రాజు,  లైబ్రరీ సిబ్బంది, అధ్యాపకులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కిట్స్‌డబ్ల్యు  చైర్మన్,  కెప్టెన్ వి. లక్ష్మీకాంతా రావు & కిట్స్‌డబ్ల్యు కోశాధికారి పి. నారాయణరెడ్డి  అడిషనల్ సెక్రెటరీ, వి. సతీష్ కుమార్  "జాతీయ గ్రంధ పాలకుల దినోత్సవం ను నిర్వహించినందుకు కేంద్ర గ్రంధాలయం విభాగాన్ని అభినందించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు