జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
కలెక్టర్ కార్యాలయంలో,
ఐటిడిఏ ఏటూరు నాగారంలోకంట్రోల్ రూం ఏర్పాటు
అన్ని శాఖల అధికారులకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ
***
జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తునందున ప్రయాణాలు చేయవద్దని, వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఐటిడిఏ ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ సెల్ నెo. 6309842395. 08717-293246 లేదా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 7109 ను సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.
జిల్లాలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వీటి వల్ల పెద్ద ఎత్తున వరదలు వచ్చే ప్రమాదం ఉందని , దీనిని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అధికారి హెడ్ క్వార్టర్ మైంటైన్ చేయాలని, రోడ్ల పై వరద నీటిని ఎప్పటికప్పుడు స్థానిక సంస్థ సిబ్బంది క్లియర్ చేయాలని, విద్యుత్ సరఫరా త్రాగునీటి సరఫరా ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేసేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
భారీ వరదలు వచ్చే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని నీటి వనరులు అందులోని నీటి నిల్వ పరిస్థితి, చెరువు కట్టలు మొదలవు వాటిని అధికారులు పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
అతి భారీ వర్షాలను నేపథ్యంలో ప్రజలు అధికార యంత్రంగానికి సంపూర్ణంగా సహకరించాలని, 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box