ల‌క్న‌వ‌రం సరస్సు సందర్శించిన మంత్రులు




మంగళవారం గోవిందరావు పేట మండలం బస్సాపూర్ గ్రామం లోని ల‌క్న‌వ‌రం చెరువును  రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖల  మంత్రి దనసరి అనసూయ  సీత‌క్క‌ తొ కలసి సందర్శించి, బోటింగ్ చేశారు. లక్నవరం ఐల్యాండ్లో ని ఉడెన్ కారేజీలను పరిశీలించారు. పర్యాటకుల వసతుల గురించి అధికారులు మంత్రికి వివరించారు.


ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు.  



ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్., ఎస్పి షభరిష్, 

డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ కే. సత్య పాల్ రెడ్డి, కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు, జిల్లా మండల అధికారులు  పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు