వచ్చే జాతర కల్లా అద్భుత ఆవిష్కరణ జరిగేలా ఉండాలన్న మంత్రి
మేడారం పై మంత్రిసీతక్కస్పెషల్ ఫోకస్-శాశ్వత ప్రాతిపదికన కార్యాచరణ
సమ్మక్క సారలమ్మ జాతర జరిగే మేడారంరూపు రేఖలు మారనున్నాయి. రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మేడారం అభివృద్దిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
మేడారంలో శాశ్వత అభివృద్ధి
పనుల అంచనా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
గత జాతరల సందర్భంగా తలెత్తిన సమస్యల దృష్యా లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక వసతులు రవాణా సౌకర్యాలుుసమకూర్యాలని నిర్ణయించామని మంత్రి తెలిపాపారు.
మేడారం అతిధి గృహంలో జరిగిన సమీక్షసమావేశంలో మంత్రి అధికారులకు కార్యాచరణపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని శాఖల వారీగా అధికారులకు సూచించారు.
జారకువచ్చే ప్రధాన రహదారుల వెడల్పుతో పాటు వివిద కూడల్లలో పర్యాటక రంగం ప్రాధాన్యతలను తెలిపే విదంగా హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు.
మేడారం పరిసర ప్రాంతాల్ల ప్రకృతి వనాలు అభివృద్ది చేయాలన్నారు. ఒకప్పుడు దట్టమైన అడవి ఉండేదని జాతర కొచ్చేవారు చట్ల కింద సేదతీరే వారని ఇప్పుడు అడవులు తగ్గిపోయి వాతావరణం మారిపోయిందని ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని అన్నారు.
మేడారం పరిసరాలలో స్థానికరైతులు పండ్ల తోటలు పెంచేలా ప్రోత్సహిస్తామని అన్నారు.
జాతరకు వచ్చే భక్తులు కూడ ఇక్కడ పచ్చదనం పరిగేలా సహకరించాలని కాలుష్యాన్ని కలిగించే ప్లాస్టిక్ వస్తువులు , కవర్లు పడేయ వద్దని కోరారు.
మేడారం వచ్చే భక్తులు మొక్క తోవచ్చి మొక్కు చెల్లించు కోవాలని అమ్మవారి దగ్గర మొక్క నాటడమే పెద్ద మొక్కని అన్నారు. మేడారం ప
రిసరాలలో పరిశుభ్రత పచ్చదనం వెల్లి విరియాలని అన్నారు.
జాతర ప్రదేశంలో చేపట్టాల్సిన పనులు వివరిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో క్యూలైన్స్ పై షెడ్స్ నిర్మాణం చేపట్టాలని, గిరిజన పూజారుల నుంచి అభ్యంతరాలు తలెత్తితే వారికి అర్థమయ్యేలా పిపిటిల ద్వారా వివరాలను ప్రదర్శించాలని తెలిపారు.
వర్షాకాలం తర్వాత అక్టోబర్ మాసం నుంచి పనులు సాఫీగా జరుగుతాయని తెలిపారు.
అందరూ అధికారులు కలిసి సమన్వయం తో జాతర విశిష్టత తెలియజేసే విధంగా పనిచేయాలి. అధికారులు మనస్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని మేడారం జాతరకు వచ్చే భక్తులకు అణువణువునా సమ్మక్క సారమ్మ దేవతల ఆధ్యాత్మిక ప్రాధాన్యత కనబరిచే విధంగా ఈ ప్రాంతాన్ని రూపొందించాలని, జంపన్న వాగు పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని, మేడారం జంపన్న వాగు పరివాహక ప్రాంతం చుట్టూ చెట్ల పెంపకం, వనాల ఏర్పాట్లకు సంబంధించి సలహాలు సూచనలు అందించాలని తెలిపారు .
మేడారం జాతర అభివృద్ధి పనులను అంకితభావంతో నిర్వర్తించాలని, రాబోయే జాతరలో మహా అద్భుతాన్ని సమక్క - సాలమ్మ సన్నిధిలో ఆవిష్కరించే విధంగా
కృషి చేయాలన్నారు.
ఈ నెల 5 వ తేదీ నుండి 9 వ తేది వరకు ఐదు రోజులు నిర్వహించనున్న
స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో అధికారులు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు అని నిరూపించే విధంగా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాలని సూచించారు. అద్భుతంగా తీర్చిదిద్దిన గ్రామాన్ని ,
ఆ గ్రామ ఇంచార్జీ అధికారికి స్వతంత్ర దినోత్సవం రోజున సత్కరించడం జరుగుతుందని తెలిపారు.
అధికారులకు ఎంత మంచిగా పని చేస్తే అంత మంచి పేరు వస్తుందని , అలాంటివారు చరిత్రలో నిలిచిపోతారని చేసిన పనికి తప్పకుండా ఫలితం ఏదో ఒక రూపంలో వస్తుందని, వెనుకబడ్డ ములుగు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో అధికారులు కీలకపాత్ర పోషించాలని మంత్రి సూచించారు.
జిల్లా కలెక్టర్ దివాకర
సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ మంత్రి సలహాలు సూచనలు ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా 2024 లో జరిగిన జాతరను విజయవంతం చేశారని అన్నారు. తాత్కాలిక అభివృద్ధి పనులు కాకుండా సమగ్ర అభివృద్ధి పనులు మేడారం ప్రాంతం లో జరగాలని వాటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశం లో ఐటిడిఏ పి.ఓ. చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి. హెచ్. మహేందర్ జి,
డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్,
ఆర్డీఓ కే. సత్యా పాల్ రెడ్డి ఎస్సీ ఎన్పీడీసీఎల్ మల్చుర్, ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ మల్లేశం ఈ ఈ ఆర్ అండ్ బి వెంకటేశ్, ఈ ఈ పంచాయతీ రాజ్ అజయ్ కుమార్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ వీరభద్రం, ఎండోమెంట్ ఈ ఓ రాజేందర్, మండల ప్రత్యేక అధికారి డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, జిల్లా పర్యటక శాఖ అధికారి సూర్య కిరణ్ తాడ్వాయి తహసిల్దార్ రవీందర్, ఎంపీడీవో, సుమన వాణి
తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box