మాడల్ గ్రామాలుగా మారు మూల గ్రామాలు -మంత్రి సీతక్క



గిరిజన గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి

మారు మూల గ్రామాలను మాడల్ గ్రామాలుగా తీర్చి దిద్దడమే ప్రభుత్వ లక్ష్యం.

జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తాము 

రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి  అనసూయ సీతక్క.         

*** 

ములుగు జిల్లాను  అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏజెన్సీ గ్రామాలను మోడల్ విలేజెస్ గా అభివృద్ది చేయడానికి దాతల సహకారం తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి  అనసూయ సీతక్క  అన్నారు. 


ఆదివారం వేంకటపూర్ మండలం లోని నంది పహాడ్ కోయ (షెడ్యూల్డ్ తెగలు) లో  నిర్మాన్ సంస్థ, ఆడమా సహకారం తో గ్రామాన్ని దత్త త తీసుకుని చేసిన అభివృద్ధి పనులు మంత్రి ప్రారంభించారు.

మారుమూల గ్రామాలను మోడల్ గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు దాతలు ముందుకు రావాలన్నారు.



  బోర్‌వెల్, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ టాయిలెట్లు (2+2)   కమ్యూనిటీ షెడ్, స్ట్రీట్ లైట్స్ (10)  పశువుల నీటి ట్యాంకులు (2) గృహాల కోసం లైటింగ్ (20) ఏర్పాటు చేసార

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడంలో దాతల సహకారం ఎంతో గొప్పదని, ఏజెన్సీ ప్రాంతాలలో పలు స్వచ్ఛంద సంస్థల వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఎన్నటికీ మర్చిపోలేమని తాను గతంలో కరోనా వచ్చిన సమయంలో చేసిన సహాయం చిన్నదని స్వచ్ఛంద సంస్థల వారు చేస్తున్న కార్యక్రమాలు గొప్పవన్ని కొనియాడారు.

 కొద్దిరోజుల క్రితం తక్కలపాడు గ్రామంలో ఒక బాలిక గ్రామంలో పాఠశాల నిర్మించాలని ఆవేదన వ్యక్తం చేయడంతో తాను జిల్లా అధికారుల ఆదేశించి వెంటనే పాఠశాల నిర్మాణం చేయాలని కోరగా కలెక్టర్, ఎస్పీ స్పందించి పక్షం రోజులలో పాఠశాల నిర్మాణం చేయడంతో దానిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

ములుగు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి జిల్లా అధికారులు సహకరించిన విషయాన్ని ఎన్నటికీ మర్చిపోలేము అని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో దట్టమైన అడవి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మరుగుదొడ్ల వాడకం, మంచినీటి వాడకం,  కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని, దీనిపై త్వరలోనే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని అన్నారు. గ్రామాలలోని ప్రజలు ఐక్యతతో అభివృద్ధి సాధించుకోవాలని, ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల వారు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వం  గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక చోరువ తీసుకుంటున్నామని, అన్ని గ్రామాలను మాడల్ గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. 


జిల్లా కలెక్టర్  దివాకర టి ఎస్ మాట్లాడుతూ తాను అనేక రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వహించడం జరిగిందని, ఆయా ప్రాంతాల్లోని గిరిజన గిరిజనేతర ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం జరిగిందని అన్నారు. మాటలతో కాకుండా చేతులతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వ ఆదేశాలు, మంత్రిగారి సూచనతో ముందు కుపోతున్నామని అన్నారు. 

జిల్లా, నియోజకవర్గ అభివృద్ధి కోసం  మంత్రి సీతక్క గారి  సూచించిన సలహాలు తూచా తప్పకుండా పాటించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల వారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఎల్లవేళల తమ సహకారం ఉంటుందని, గ్రామాల అభివృద్ధి కోసం స్వచ్ఛంద సంస్థల వారు  ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో  డి ఎస్ పి రవీందర్, ఎంపి డి ఓ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు