ఆరుద్ర ఎంత ముద్ర వేసారో నా జ్ఞాపకాలపై..ఎలిశెట్టి సురేష్ కుమార్

 


(మా ఊళ్లో చిన్నప్పుడెప్పుడో

మురళీ కేఫ్ హోటల్లో ఆరుద్ర 

భోజనం చేస్తుంటే గుర్తుపట్టి పలకరించిన సా(వా)హసానికి

ఆరుద్ర ఎంత ముద్ర వేసారో 

నా జ్ఞాపకాలపై..

అలా జర్నలిస్టు కాకమునుపే

నేను భాగ్యంతో భాష్యం విన్న

పెద్దాయన భాగవతుల..)


*_అది ఆరుద్ర ముద్ర..!_*

********************

*_త్వమేవాహం.._*

ఓ సాహితీ ప్రవాహం..

మహాకవి శ్రీశ్రీ 

మెచ్చి దాసోహం..

*_ఆరుద్రకే చెల్లిన ఆరోహం!_*


గేయమైనా..సినీ గీతమైనా

ప్రతి పదంలో తన ముద్ర..

ఔను..ఇది రాసింది ఆరుద్ర...

అది ఆయన శైలి..

అందుకే అయ్యాడు *_సినీవాలి!_*


*_కూనలమ్మ పదాలు_*

పలికితే మురిసిపోవా పెదాలు..

*_రహదారి బంగళా.._*

ఆరుద్ర మార్కు 

*_సాహితీ మేళా!_*


బీదలపాట్లుతో మొదలైన సినీప్రస్థానం..

పేదరికమే చూపింది 

చాలా కాలం..

కొళాయి నీరు త్రాగి

అక్షరాల పంపు విప్పితే

*_వేదంలా ఘోషించె గోదావరి_*

*_అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి.._*

అంతకు ముందే

*_కొండగాలి తిరిగింది_*

*_గుండె ఊడులాడింది_*

*_గోదావరి వరద లాగ_*

*_కోరిక చెలరేగింది.._*

సినిమా పాట 

దశే మారింది..!


పొడుగాటి లాల్చీ..

అంతకంటే పొడుగైన గెడ్డం..

తెల్లటి పైజమా..

భుజాన సంచి..

అతడేగా మధురగీతాల విరించి..

తానుగా హేతువాది..

అయినా ఆ కలంలో

ఇందీవర శ్యాముడు 

అందువలన దేముడు

అయ్యాడు దాశరథి..!


బాలభారతంలో రాసే

అవకాశం వస్తే

ఆకాశానికి నిచ్చెనలేసి 

ఎక్కిన భీముడు

*_మానవుడే మహనీయుడై_*

*_శక్తియుతుడు యుక్తిపరుడై_*

మాననీయుడూ అయ్యాడు అరుద్ర పెన్నుతొ..

*_రాయినైనా కాకపోతిని_*

*_రామపాదము సోకగా_*

అంటూ వాణిశ్రీ 

నీటిని..నిప్పును

కురిపించింది చెరో కన్నుతో!


కవీ..కవికి వలదయ్య 

ఈ కాగితము..

అంటూ ప్రత్యక్షంగా

పొట్టి ప్రసాదుకి చురకలేసాడు

మల్లెపూవులో.. 

ఠావుల కొద్ది మాటలు

టన్నుల కొద్ది పాటలు రాసిన భాగవతుల శివశంకర శాస్త్రి

బహు కావ్యసౌధాల 

*_అక్షర మేస్త్రి!_*

************************

_ఆరుద్ర జయంతి_

(31.08.1925)

_సందర్భంగా ప్రణామాలు_


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

      9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు