సమిష్టి సహకారం తో సమర్ధవంతగా విధుల నిర్వహణ
-పదవి విరమణ కార్యక్రమంలో సమాచారశాఖ సంయుక్త సంచాలకులు మహమ్మద్ ముర్తుజా
అధికారులు ఉద్యోగుల సహకారంతోఉద్యోగ బాధ్యతలను విజయవంతగా నిర్వర్తించానని సమాచారశాఖ సంయుక్త సంచాలకులు మహమ్మద్ ముర్తుజా తెలిపారు. ప్రస్తుతం జి హెచ్ ఎం సి లో సంయుక్త సంచాలకుల హోదాలో సిపిఆర్ ఓ గా విధులు నిర్వర్తిస్తూన్న మహమ్మద్ ముర్తుజా శనివారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్బంగా హైదరాబాద్ రాష్ట్ర సమాచార శాఖా కార్యాలయంలో ఆ శాఖా అధికారులు ఉద్యోగుల ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ తన 31 ఏండ్ల ఉద్యోగ జీవితంలో సహాయ పౌర సంభంధాల అధికారి నుండి సంయుక్త సంచాలకుల వరకు వివిధ హోదాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో పని చేశానన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరేవేసే క్రమంలో అటు అధికారులు ఇటు ఉద్యోగులను సమన్వయము చేసుకుంటూ పతాక ఫలాలను పెద్ద ప్రజలకు చేరవేయడం లో తన వంతు బాధ్యతను నిర్వహించనున్నారు. తన ఉద్యోగ బాధ్యతలో నిర్వహణలో సహకరించిన అధికారులు, సిబ్బంది , మీడియా ప్రతినిధులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర సమాచార శాఖ అదనపు సంచాలకులు డి ఎస్ జగన్ మాట్లాడుతూ తనదైనబ పని తీరుతో మహమ్మద్ ముర్తుజా సమాచార శాఖకు మంచి గుర్తింపుని తీసుకొచ్చారని కొనియాడారు. విధుల నిర్వహణలో క్షేత్రస్థాయిలో వచ్చే ఒత్తిడిని నేర్పుతో అధిగమించి సమర్ధవంతగా తన విధులు నిర్వహించారని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో సిబ్బందికి అండగా వుంటూ మెరుగైన పనితీరు కనబర్చేలా వారిని ప్రోత్త్సహించారన్నారు. సమాచారశాఖకు సుదీర్ఘకాలం చేసిన సేవలు మరువలేనివని అయన నుంచి నేటి తరం ఎంతో నేర్చుకోవాలిసివుందన్నారు.
సంయుక్త సంచాలకులు డి. శ్రీనివాస్ మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన మహమ్మద్ ముర్తుజా ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకొని ఎందరితో స్ఫూర్తి గ నిలబడ్డారని అన్నారు. ఉద్యోగ విధుల నిర్వహణలో తన సిబ్బందికి మార్గదర్శకం చేస్తూ వెన్నంటే ఉండేవారన్నారు. ఉద్యోగులను కుటుంబంగా భావించేవారని అధికారులు ఉద్యోగులతో స్నేహబంధంతో మెదిలేవారని ప్రశంసించారు.
కార్యక్రమంలో తెలంగాణ మాస పత్రిక ఎడిటర్ శాస్త్రి, చీఫ్ సమాచార ఇంజనీర్ రాధాకిషన్, ప్రాంతీయ ఉపకార్య నిర్వాహక సమాచార ఇంజనీర్ జైరాం ఉప సంచాలకులు వై. వెంకటేశ్వర్లు, ఎం.ఏ హష్మీ, ఎం.మధుసూదన్, సిహెచ్ రాజా రెడ్డి, సహాయ సంచాలకులు ఎం. దశరధం, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు, ఉద్యోగులు హాజరయ్యారు.
-------ends
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box