తరతరాల అణచివేతను ఎదురించాలి ఐ ఎల్ పి ఎ నాయకులు సాయిని నరేందర్

 


తరతరాల అణచివేతను ఎదురించాలి

ఐ ఎల్ పి ఎ నాయకులు సాయిని నరేందర్ 

జనగామ బార్ లో పోస్టర్ ఆవిష్కరణ

     సమాజ హితం కోసం

తరతరాలుగా సేవ చేస్తున్న బి.సి లను ఈ దేశ పాలకులు అన్ని రంగాల్లో అణచివేస్తున్నారని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని జిల్లా *కోర్టు బార్ అసోసియేషన్ లో జనగామ బార్ అద్యక్షులు ఎలగందుల చంద్రఋషి అధ్యక్షతన* మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన సదస్సు వాల్ పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. బి.సి సమస్యలపై ఈ నెల 25 న హైదరాబాద్ లోని జవహార్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ ఆడిటోరియం లో జరుగు ఒబిసి న్యాయవాదుల రాష్ట్ర సదస్సులో న్యాయవాదులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం తెలంగాణ న్యాయవాదులు పోరాటం చేసినట్లుగా బి.సి ల విముక్తి కోసం బి.సి న్యాయవాదులు పోరాడాలని పిలుపునిచ్చారు. సకల సామాజిక రంగాల్లో ఎవరెంతమందో వారికంత వాటా కోసం జరిగే పోరాటంలో న్యాయవాదులు ముందుండాలని అన్నారు.



    రాజ్యాంగంలో బి.సి హక్కులకు చోటివ్వలేదని, ఆర్టికల్ 340 ప్రకారం బి.సి ల అభివృద్ధికి కావాల్సిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించారని, ఆ క్రమంలో మన పూర్వీకులు చేసిన పోరాటం వల్ల 1956 లో కాకా కలేల్కర్ కమేషన్, 1978 లో బి.పి మండల్ కమీషన్లు వేసి బి.సి స్థితిగతులు అధ్యయనం చేసి ప్రభుత్వాలకు నివేదికను సమర్పించినా నేటికీ అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. బి.సి లకు రిజర్వేషన్లు పెంచినప్పుడల్లా జనగణన లేదని కోర్టులు అడ్డుపడుతున్నారని, బ్రిటిష్ పాలనలో 1931 లో జరిగిన బి.సి జనగణన తర్వాత ఇప్పటివరకు భారతదేశంలో జనగణన చేయలేదని, బి.సి ల అభివృద్ధికి మూలాధారమైన బి.సి కుల జనగణనపై ప్రదాన రాజకీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ లు దొంగాట ఆడుతున్నాయని అన్నారు. బిజెపి ప్రతిపక్షంలో ఉన్నపుడు బి.సి కుల జనగణన చేయాలని, వారు అధికారంలోకి వస్తె కుల జనగణన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చారని, ప్రస్తుతం ప్రతిపక్షంలోనున్న కాంగ్రెస్ బి.సి కుల జనగణన చేయాలని పార్లమెంటులో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే బి.సి కుల జనగణన కోసం దేశవ్యాప్త ఉద్యమం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరచిన బి.సి కుల జనగణన జరిపి స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 

   రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలతో పాటు కీలక రంగమైన జుడీషరీలో బి.సి లకు సముచిత వాటా దక్కడం లేదని, సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా సాధన కోసం జరిగే పోరాటంలో బి.సి న్యాయవాదులతో పాటు ఇతర రంగాల్లో ఎదిగిన బి.సి లు ముందుండాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25 న జరుగు సదస్సు కు బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, గౌరవ అతిథిగా హై కోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద తో పాటు బి.సి కమీషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ హాజరవుతున్నారని తెలిపారు. బి.సి కుల జనగణన - బి.సి ల అభివృద్ధి, సామాజిక న్యాయం - జనాభా దామాషా ప్రకారం న్యాయ వ్యవస్థలో వాటా, మహిళా రిజర్వేషన్లలో బి.సి కోటా, పావులుగా బి.సి లు - అధికారంలో ఆధిపత్య కులాలు అనే నాలుగు అంశాలపై రోజంతా జరిగే సదస్సులో వకులాభ కృష్ణ మోహన్, కర్ణాటక కోర్టు సీనియర్ న్యాయవాది ఎస్ బాలన్, పూనే కోర్టు సీనియర్ న్యాయవాది వాసంతి నల్వాడ, ప్రొఫెసర్ సింహాద్రి, మధ్యప్రదేశ్ సీనియర్ న్యాయవాది వినాయక్ ప్రసాద్ షా లు గొప్ప సందేశంతో పాటు విలువైన సమాచారం కూడా అందిస్తారని నరేందర్ తెలిపారు. 

   *బార్ అసోసియేన్ అద్యక్షులు ఎలగందుల చంద్రఋషి మాట్లాడుతూ* బి.సి సమాజాన్ని చైతన్యం చేసి హక్కుల సాధన కోసం దేశంలోనే మొదటి సారి జరుగుతున్న ఒబిసి న్యాయవాదుల సదస్సుకు న్యాయవాదులు పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేసారు.

    ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు మాధవ కృష్ణ, సిక్కుల్ల  బిక్షమయ్య, పూస మల్లేష్, జనగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్ర రుషి, ప్రధాన కార్యదర్శి నక్క సిద్ధులు యాదవ్, ఉపాధ్యక్షులు బాలకిషన్ గౌడ్, కోశాధికారి చెరుకు చంద్రశేఖర్, క్రీడా కార్యదర్శి పసునూరి మురళి, ఇ సి మెంబర్ మధుసూదన్ న్యాయవాదులు మంచాల రవీందర్, గాజుల రవీందర్, సిద్ధిరాములు, హరీష్, స్వప్న, జ్యోత్స్న, ఉమాదేవి, నరసింహ, రవి కుమార్, ముజీబ్, పానుగంటి శ్రీనివాస్, కోట శంకర్, రాజశేఖర్, బాలరాజు, నరసింహ, రవి, స్వామి, సుదర్శన్, కవిత, రేణుక, రాధిక, రేఖ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు