*_బ్రతుకు భారం.._*
*_జీవితమే తులాభారం..!_*
_______________________
*సంచితో సొమ్ములు పట్టుకెళ్ళి బండితో సరుకులు తెచ్చుకున్న* *సత్తెకాలపు రోజులు చెల్లి* *బండితో డబ్బులు* *తీసుకెళ్ళినా సంచితో* *సరుకులు తెచ్చుకోలేని రోజులు..!*
ఈ మాట ఇప్పుడు
అక్షరాలా నిజం..
అదే నేటి సర్కార్ల ఇజం..!
ఆమ్మబోతే అడివి..
కొనబోతే కొరివి..
పెరిగిన ధరలతో అమ్మకు
ఇల్లు నడపడం బరువే..
ఎవర్ని ఎన్నుకున్నా
కొరివితో తలగోకుడే..
ఇంట్లో ఎండిన మూకుడే..!
అంగట్లో అన్నీ ఉన్నా
మన నోట్లోనే శని..
నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్లాలంటే కరిగిపోవునేమో బంగారు గని..
గొప్పోడికి కార్పొరేట్ స్వైపింగ్..
పేదోడికి ఇంటికే
రేషన్ రీచింగ్..
ఈ రెండూ లేని మధ్యతరగతి బతుక్కి ప్రతిరోజూ వీపింగ్..!
జీవితం త్రిశంకుస్వర్గంలో..
రోజంతా కష్టాల దుర్గంలో..
మధ్యతరగతి మానవుడు
చస్తున్నాడు మధ్యేమార్గంలో..
చాలీచాలని రాబడి..
చేసిన అప్పులకు
జీవితమంతా కట్టుబడి..!
బస్సెక్కితే వంద..
సినిమాకెళ్దామంటే మూడొంద..
ఇంకేం సినిమా నా బొంద..!
వీటికి తోడు కొత్తగా వచ్చిపడిన
కేబుల్ టివి..
అన్లిమిటెడ్ కాల్స్
ఆపై నెట్ కనెక్షన్..
వీటి రీఛార్జికి నెలకి మూడువేలు క్షవరం
చేయిస్తేనే ఇంట్లో
మగాడు క్షేమం..
ఇదో మోడర్న్ క్షామం...
ఇదంతా సర్కార్లు కనిపెట్టిన
సరికొత్త సంక్షేమం..!
పులి మీద పుట్రలా
ప్రైవేటైజేషన్ బెడద..
అంతటా కార్పొరేట్ల వరద..
సర్కార్లు జల్లుతున్న బురద..
అదే బాటలో బ్యాంకులు,రైల్వేలు..
ఇదిగో వీటి కంటే జోరుగా
విశాఖ ఉక్కు..
ఆంధ్రుల ఆత్మగౌరవం తుక్కు..
సిగ్గులేదు..
నేతల వెధవ బ్రతుక్కు...!
పరాకాష్టం..రగిలే రావణకాష్టం
పెట్రో..గాస్ ధరలు..
మండే పొయ్యి..
అంతకంటే వేడిగా
మండే గుండె..
సిలిండర్..
ఈరోజు ఆగి
రేపు కొందామంటే కడుపుమంటే..
ఆగిపోతే ఆకలి మంటే..
పూర్వమైతే వండుకోను
గింజలు లేకపోతే
పొయ్యిలో పిల్లి..
ఇప్పుడు కబళించేసే అకలిపులి..!
వంద దాటి పెట్రోల్..
బయటికి వెళ్లాలంటే
మనసు కంట్రోల్..
బండి కొనుగోలుకు లక్ష
బతుకు బండికి
పెట్రోల్ కొనుబడి పెద్ద శిక్ష...!
కన్నెర్ర చేసిన టమాటా..
కొనలేక గలాటా..
మటను..చికెను..
ఎగ్గు..పెగ్గు..
ఎంత పెరిగినా
సిగ్గు లేని మనం
అదే దారి..
ఓట్లు అమ్ముకుని
బ్రతుకుగడిపే ముళ్ళదారి..!
ఇలా రోజుకో కష్టం..
బ్రతుకు నికృష్టం..
నమ్ముకున్న కేంద్రప్రభుత్వం..
నమ్మి గెలిపించిన రాష్ట్రసర్కార్
ముంచేస్తే ఉభయభ్రష్టం..
బ్రతుకు దినదిన గండం..
ఎన్నాళ్ళో ఆయుష్షు..!
*_సురేష్ కుమార్_*
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box