సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
పారిశుధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టాలి.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని.. వాటి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులకు సూచించారు.
శుక్రవారం వెంకటాపురం మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ దివాకర
టి. ఎస్. ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పేషేంట్ల కు అందే వైద్య సౌకర్యాలు ను వారిని అడిగి తెలుసుకున్నారు. డ్యూటీ మెడికల్ ఆఫీసర్లతో మాట్లాడారు. అలాగే జ్వరాల బారిన పడి చికిత్స పొందుతున్న పేషెంట్లను వారికి అందే వైద్య సదుపాయాలు కే షీట్లు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని, వ్యాధుల పరిస్థితిపై రోజువారీగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. డెంగీ కేసు నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని, పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, అన్ని ఇండ్లు, సంస్థల్లో కార్యక్రమాన్ని చేపట్టి, నిల్వ ఉన్న నీటిని బయట పారబోసి దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అనంతరం నూగురు గ్రామంను సందర్శించి ఇంటింటి పరిసరాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విష జ్వరాలు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.
గ్రామంలో పరిసరాల పరిశుభ్రత, మురికి నీటి గుంతలు, నిర్మూలన, డ్రైనేజీ పూడిక లు చెత్తాచెదారం తదితర అంశాలపై ఆయా గృహస్థులకు అవగాహన కల్పించి, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దోమల బారిన పడకుండా మురికి నీటి గుంటలను నిర్మూలించేందుకు, చెత్తాచెదారాన్ని ఎప్పటిక ప్పుడు శుభ్రం చేయాలని కోరారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ పూడిక తీత తదితర పనులను బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్
చేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశాలు జారి చేశారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామస్తులు పరిసరాల పరిశుభ్రతతో ముందుకు సాగాలన్నారు. అనంతరం తాహసిల్దార్ కార్యాల యంలో అధికారులతో సమావేశం నిర్వహించి రికార్డులను పరిశీలించారు. మండలంలో వివిధ అంశాలు, భూములు రేషన్ కార్డులు, నిత్యవసర వస్తువులు, భూములు, ఇతర ప్రజా పాలన అంశాలపై తహసీల్దార్ ను అడిగి తెలుసు కున్నారు.
ఈ కార్యక్రమంలో మండల తాహసిల్దార్ లక్ష్మి రాజయ్య,
మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్, డిప్యూటీ తాహ సిల్దార్ మహేందర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్య, మెడికల్ ఆఫీసర్లు, వైద్య ఆరోగ్యశాఖ
సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box