ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా బాంబుపేల్చారు. బిఆర్ఎస్ పార్టి త్వరలోనే బీజెపిలో విలీనం అవుతుందని చెబుతూ కెసిఆర్,కెటిఆర్ల కు పదవులు కూడ ఫిక్సు అయ్యాయని తెలిపారు. "త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుంది...కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవిని బీజేపీ ఇస్తుంది" అని తెలిపారు. ఇక అల్లుడు హరీశ్ రావు గురించి చెబుతూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీశ్ రావు నియమితులవుతారని అన్నారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితకు బెయిల్ కూడా వస్తుందని తెలిపారు. కవితకు కూడ పదవి ఇస్తారని ఆమెను రాజ్యసభకు పంపుతారని అన్నారు. బిఆర్ఎస్ కు ఎందుకు బిజెపి ప్రాధాన్యత నిస్తుందో తెలిపారు. బిఆర్ఎస్ అవసరం బీజేపీకి ఉందన్నారు. బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని బీజేపీకి వీరి మద్దతు తప్పని సరి అవసరమని అన్నారు.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చాలా రోజులుగా బిఆర్ఎస్ బిజేపీలో విలీనం అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఈ మద్యేసీరియస్ గా స్పందించారు. వీలీనం అంటూ రేవంత్ రెడ్డికి సంభందించిన మీడియాల కథనాలు పని గట్టుకుని వస్తున్నాయని వీలీనం అంటూ వార్తలు ప్రచారం చేస్తే న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని కూడ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్, కిషన్ రెడ్డి కూడ వీలీనం వార్తల్లో నిజంలేదని పలు మార్లు వివరణ కూడ ఇచ్చారు.
అయినా రేవంత్ రెడ్డి ఇదే అంశంపై ఢిల్లీలో మీడియా ఎదుట బిఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చిన కెటిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రం తో రేవంత్వి రెడ్డి కి కౌంటర్ఇ చ్చాడు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని, కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్రమంత్రి కాబోతున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కూల్ గానే కౌంటర్ ఇచ్చాడు.
బీఆర్ఎస్ విలీనమంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి చెప్పినటువంటి స్టోరీలు తాను కూడా మస్తుగా చెప్పగలనన్నారు.
"రేవంత్ రెడ్డి తొందరలోనే అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. మనోడు అమెరికా అధ్యక్షుడు అవుతాడని.. మొన్ననే కేజీఎఫ్‌లో ఏదో మీటింగ్ పెట్టి ఆయనెవరో చెప్పారు కదా... ఈయనే అవుతాడేమో మరి. ట్రంప్ సరిపోవడం లేదని.. రేవంత్‌ను పిలుస్తున్నారేమో" అని వ్యంగ్యంగా అన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box