పద్నాలుగు రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలలో పర్యటన
సీఎంతో పాటు వెళ్లనున్న సీఎస్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
ఆగస్ట్ 14 వరకు విదేశాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి బృందం
భారి పెట్టుబడులు లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయన పద్నాలుగు రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలలో పర్యటించనున్నారు. అగస్ట్ 14వ తేదీ వరకు ఆయన విదేశాల్లో ఉంటారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెళుతున్నారు.
ఈరోజు నుంచి 9వ తేదీ వరకూ న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ప్రాన్సిస్కో నగరాల్లో ముఖ్యమంత్రి బృందం పర్యటించనుంది. అమెరికాలో పలువురు వ్యాపారవేత్తలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. సీఎం బృందం ఇవాళ నేరుగా న్యూయార్క్ వెళుతుంది. 4వ తేదీన న్యూజెర్సీలో పర్యటించనుంది. 5న న్యూయార్క్ కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ అవుతారు. మరోవైపు, ఆగస్ట్ 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా వెళ్లనున్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box