రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం : రాష్ట్ర పంచాయితి రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

 


రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం :: రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి  దనసరి అనసూయ సీతక్క.

ఏటూరు నాగారం సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన... మంత్రి సీతక్క.

మండల ప్రజా పరిషత్ కార్యాలయం అదనపు గదుల భవనం ను ప్రారంభించిన... మంత్రి సీతక్క.

ఐటిడిఏ ఏటూరు నాగారం సమావేశ మందిరం లో  వ్యవసాయ, వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి.


**


రైతును  రాజు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి  దనసరి అనసూయ సీతక్క అన్నారు.


శుక్రవారం ఐటిడిఏ ఏటూరు నాగారం సమావేశ మందిరం లో రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి  దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐ టి డి ఏ పి ఓ చిత్ర మిశ్రా లతో కలిసి వ్యవసాయ, వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా,  రైతులను అన్ని విధాల ఆదుకోవడం కోసం, సహాయం చేస్తూ రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఎవరు కూడా బ్యాంకర్లు  రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పెట్టవద్దన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో విష జ్వరాలు విజృంభిస్తుండడంతో. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని. ప్రజలు ఎవరు కూడా జ్వరాల బారిన పడి మృతి చెందవద్దన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ములుగు జిల్లాలో పని చేసే ఉద్యోగులు అందరూ కూడా మంచి సామర్థ్యం నైపుణ్యాలు ఉన్నవారే పని చేస్తున్నారని అదే విధంగా తమ సామర్థ్యాలను పదును పెడుతూ నూతన ఆలోచనలు, నూతన విధానాలు పరిపాలన కి తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులు పని చేసే ప్రాంతాలలో తలెత్తే సమస్యలను ఏ విధంగా పరిష్కరిచాలో ఆలోచించాలని , అధికారులు ప్రజలకోసం చేసే మంచి పనులు చరిత్ర లో నిలిచిపోతాయని, జిల్లాలో పని చేసే ప్రతి ఉద్యోగి పోటీ తత్వం తో పని చేస్తూ ములుగు జిల్లాను అభివృద్ధి పధం లో ముందుకు తీసుకురావాలని అన్నారు.



అంతకుముందు  మండల కేంద్రంలో ఫిష్ మార్కెట్ నుంచి వై జంక్షన్ వరకు సి ఆర్ ఆర్ 75 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ ను, సుమారు 30 లక్షల నిధులతో నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయం అదనపు గదుల భవనం ను  మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. తో కలిసి ప్రారంభించారు. 


ఈ కార్యక్రమంలో  డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, ఏరియా ఆసుపత్రి సూపర్ ఇండెంట్ జగదీశ్వర్, మెడికల్

క ప్రిన్సిపాల్  మెహన్ లాల్, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకు అధికారులు, వైద్య అధికారులు, మండల ప్రత్యేక అధికారి సివిల్ సప్లై 

మేనేజర్ రాంపతి , ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఎంపీఓ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు