ప్రతి పోరడ -మంచి పౌరుడైతే..!



 *_ప్రతి పోరడు_* 

*_మంచి పౌరుడైతే..!_*


✍️✍️✍️✍️✍️✍️✍️


_కొంతమంది కుర్రవాళ్ళు_ 

_పుట్టుకతో వృద్దులు.._

_పేర్లకి..పకీర్లకి..పుకార్లకి నిబద్దులు..!_


*ఇలా అన్న శ్రీశ్రీనే*


_కొంతమంది యువకులు_ _ముందు యుగం దూతలు.._

_పావన నవజీవన_

_బృందావన నిర్మాతలు..!_


*ఇలా కూడా అన్నాడు..*


కత్తికి రెండు పక్కల పదును..

మహాకవి కలానికీ 

అన్ని పక్కలా పదునే..!


_అయితే ఎటు పోతోంది_

_నేటి యువత.._

*_ఈ దేశభవిత..!?_*


వయసు వచ్చే పాటికి

రెక్కలు తొడిగి

విదేశాలకు 

పోవాలన్న తపన..

అందుకోసమే యాతన..

*_ఇది చదువుకున్నోడి తీరు..!_*


జంక్షన్లు.. ఫంక్షన్లు..

అయితే రాజకీయ నాయకుడు..

లేదంటే సినిమా హీరో..

వీళ్లే రోల్ మోడల్స్..

జీవితానికో ఎజెండా లేక

ఎవరో ఒకరి జెండా మోస్తూ..

ఎంత వయసొచ్చినా

*_తల్లితండ్రులే_* 

*_వీరి బరువు మోస్తూ..!_*


రంగుల చొక్కాలు.

చిరిగుల పంట్లాలు..

చేతిలో మిక్స్చరు పొట్లాలు..

వింత వింత కటింగులు..

హైస్పీడు బళ్ళు..

బాధ్యత లేని బ్రతుకులు..!

అబ్బాయిలైతే నిక్కర్లు..

అమ్మాయిలేమో 

బిగుతు బనీన్లు..

పొట్టి ప్యాంట్లు..

ఇదే డ్రెస్..

రోడ్డే అడ్రస్..!

*_మొబైలే సర్వస్వం.._*

*_అందరూ దానికే వశం..!!_*


ఎక్కడ చూసినా ఇదే మూక..

సినిమా విడుదలైతే హంగామా..

అమ్మ అయ్య పుట్టినరోజు 

గుర్తుండదు గాని

అభిమాన నేత బర్త్ డే

ఊరంతటికీ పండగే..

ఎన్నికల్లో ఇతడే కార్యకర్త..

జెండా కట్టేది..

జనాన్ని తెచ్చేది..

అవసరమైతే ప్రత్యర్థిని బెదరించేది..

డబ్బులు పంచేది..

దొంగ ఓటు వేసేది..

అన్నీ యూతే.. 

నోరిప్పితే బూతే..

సాయంత్రం అందే మందు..

అర్ధరాత్రి దాకా 

రోడ్డుపై చిందు..

అందరూ పడుకునే వేళకి

ఇంటికి చేరి 

కాలింగ్ బెల్లు మోత..

*_ఇదేగా ఆధునిక యువత..!_*


అందరూ అలా అని కాదు..

అయితే అత్యధికం అదే తీరు

గమ్యం తెలియని గమనం..

లక్ష్యం లేని చదువు..

బాధ్యత ఉండని తిరుగుడు..

పెద్దలు సుద్దులు చెబితే సణుగుడు..

కేకలేస్తే తిరుగుబాటు..

చివరికి ఏదో ఉద్యోగంతో 

జరుగుబాటు..!


అయితే అక్కడో..ఎక్కడో 

మెరిసే ఒక చుక్క..

చిమ్మచీకట్లో వేగుచుక్క..

ఆదర్శాలు..మార్గదర్శనాలు..

బరువులు..బాధ్యతలు..

దేశభక్తి..

మన సంస్కృతిపై

అనురక్తి..!


_బానిస పంధాలను_ 

_తలవంచి అనుకరించరు.._

_పోనీ అని అన్యాయపు_

_పోకడలు సహించరు.._

*_వారికి జాతి ఆహ్వానం.._*

*_వారికే జాతి వందనం..!_*


_సురేష్..9948546286_

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు