వృత్తితో పాటు సామాజిక బాధ్యతలో న్యాయవాదులు




 వృత్తితో పాటు సామాజిక బాధ్యతలో న్యాయవాదులు 

బి.సి న్యాయవాదుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి

మంచిర్యాల బార్ అసోసియేషన్ లో పోస్టర్ ఆవిష్కరణ



     ఎందరో మహానీయుల త్యాగాలతో సమాజంలో ఎదిగిన న్యాయవాదులు వృత్తితో పాటు సామాజిక బాధ్యతలో  ముందుండాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సాంసన్ పిలుపునిచ్చారు. మంచిర్యాల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కర్రె లచ్చన్న అధ్యక్షతన మంచిర్యాల బార్ కోర్టు ప్రాంగణంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఐ ఎల్ పి ఎ ఒబిసి న్యాయవాదుల రాష్ట్ర సదస్సు వాల్ పోస్టర్ ను విడుదల చేసి ఆయన మాట్లాడారు. ఐ ఎల్ పి ఎ ఆధ్వర్యంలో గత 15 ఏండ్లుగా బహుజన వర్గాలు న్యాయవాద వృత్తిలో రాణించడం కోసం, జ్యుడీషియల్ అధికారులుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఎన్నిక కావడానికి ప్రత్యక్ష తరగతులతో పాటు జూమ్ క్లాస్ లు నిర్వహిస్తున్నామని అన్నారు. బలహీన వర్గాల్లో ఎదిగిన న్యాయవాదులు అభివృద్ధిలో వెనుకబడిన చివరి వారికి అభివృద్ది ఫలాలు అందిన నాడే సమసమాజం ఏర్పడుతుందని, ఆ దిశగా జరిగే ఉద్యమాల్లో న్యాయవాదులు ముందుండాలని ఆయన అన్నారు. 

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్ మాట్లాడుతూ బి.సి హక్కుల కోసం స్వాతంత్రం ఏర్పడిన దగ్గరి నుండి ఎన్ని పోరాటాలు జరిగిన వడ్డించే దగ్గర బి.సి లు లేకపోవడం వల్ల తీరని నష్టం వాటిల్లుతుందని అన్నారు. కాకా కలేల్కర్ కమేషన్ ను తుంగలో తొక్కి మండల్ కమీషన్ అమలులో ఆధిపత్య రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నారని, కోర్టులల్లో న్యాయమూర్తులు కూడా ఆధిపత్య వర్గాల వారు ఉండడం వల్ల కుల జనగణన లేదనే సాకుతో బి.సి ల రిజర్వేషన్లు పెంచకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. కుల జనగణనతో పాటు సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో వాటా, చట్ట సభల్లో వాటా కోసం అన్ని వర్గాల్లో ఎదిగిన బి.సి లు పోరాటంలో ముందుండాలని అన్నారు. ఈ నెల 25 న హైదరాబాద్ లో జరుగు బి.సి న్యాయవాదుల సదస్సులో మంచిర్యాల జిల్లా న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 



     ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్, జూకూరి మహేష్, మంచిర్యాల బార్ అసోసియేషన్ మాజీ అద్యక్షులు సందాని, కర్రె లచ్చన్న, మాజీ ఉపాధ్యక్షులు సుంకర బుజంగరావు, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ప్రదాన కార్యదర్శి సింగతి రాజేశ్వర్, న్యాయవాదులు కోట మల్లయ్య, నటేశ్వర్, కిరణ్ కుమార్, స్వామి, ఎస్ నిరంజన్, బండ విగ్నేష్, బి.సి ఐక్య వేదిక జిల్లా నాయకులు వొడ్డేపెళ్లి మనోహర్, నరెడ్ల శ్రీనివాస్, గుంటుక సోమయ్య, గుమ్ముల శ్రీనివాస్ తదిరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు