బి.సి న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయండి ఐ ఎల్ పి ఎ నాయకులు సాయిని నరేందర్

 


బి.సి న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయండి

ఐ ఎల్ పి ఎ నాయకులు సాయిని నరేందర్ 


     బి.సి ల హక్కుల కోసం బి.సి న్యాయవాదులు అనే సిద్ధాంతంతో ఈ నెల 25 న హైదరాబాద్ మాసాబ్ టాంక్ లోని జవహార్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ ఆడిటోరియం లో జరుగు ఒబిసి న్యాయవాదుల సదస్సుకు న్యాయవాదులు భారీ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్ విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా కేంద్రం ములుగు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వినయ్ కుమార్ అధ్యక్షతన ములుగు కోర్టులో శుక్రవారం ఆయన సదస్సు వాల్ పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. బి.సి సమాజానికున్న ప్రధాన సమస్యలైన కుల జనగణన, దామాషా ప్రకారం సకల సామాజిక రంగాల్లో వాటా, మహిళా రిజర్వేషన్లలో బి.సి కోటా, జుడీషరీ లో వాటా అనే అంశాలపై ప్రముఖులైన వకులాభరణం కృష్ణమోహవ్, ప్రొఫెసర్ సింహాద్రి, కర్ణాటక సీనియర్ న్యాయవాది ఎస్ బాలన్, పూనే సీనియర్ న్యాయవాది వాసంతి నల్వాడ, మధ్యప్రదేశ్ కు చెందిన వినాయక్ ప్రసాద్ షా లు ఈ సదస్సులో పాల్గొని విలువైన సందేశాన్ని అందిస్తారని తెలిపారు. 

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న ములుగు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వినయ్ కుమార్ మాట్లాడుతూ ఒబిసి హక్కుల కోసం బి.సి న్యాయవాదులు ముందుండాలని చేస్తున్న కృషిలో బాగంగా ఈ నెల 25 న హైదరాబాద్ లో జరుగు సదస్సుకు న్యాయవాదులు హాజరవ్వలని విజ్ఞప్తి చేశారు. బి.సి సమస్యల పట్ల బి.సి న్యాయవాదులకు అవగాహాన పెంచడం వల్ల మెజార్టీ పీడిత సమాజనికి మేలు జరుగుతుందని ఆయన అన్నారు. పాలకవర్గాలు ఉద్దేశపూర్వకంగా మెజార్టీ సమాజానికి అన్యాయం చేస్తూ పాలన కొనసాగిస్తున్నారని, అత్యున్నత న్యాయ వ్యవస్థ కూడా బహుజన సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని అన్నారు.

    ఈ కార్యక్రమంలో బార్ ప్రదాన కార్యదర్శి సునీల్ కుమార్, న్యాయవాదులు రంగోజు భిక్షపతి, కావ్య, అర్చన, అక్షర, స్వామీదాస్, మనసూద్, నర్సిరెడ్డి, రవిప్రసాద్, రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు