కిట్స్ వరంగల్ లో "యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం
*కిట్స్ వరంగల్ ఇతర కళాశాలలకు ఆదర్శ ప్రాయంగా స్ఫూర్తిదాయకంగా నిలిచిందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రశం సించారు.
కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్, పోలీస్ కమిషనరేట్ వరంగల్ మరియు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టి జి యన్ ఎ bi- టి నాబ్) సహకారంతో "యాంటీ డ్రగ్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్" కిట్స్ వరంగల్ క్యాంపస్ ఆడిటోరియంలో గురువారం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ 2021లో 16% మంది యువత వారానికి ఒక్కసారైనా డ్రగ్స్ వాడుతున్నారని 2022 నాటికి 23 శాతానికి పెరిగిందని అన్నారు.
జీవితంలో ఎదగడానికి, కీర్తి ప్రతిష్టలకోసం ఆసక్తి పెంచు కోవాలన్నారు. యువత డ్రగ్స్ లేదా ఆల్కహాల్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిస కాకుండా ఉత్తమ పద్ధతులను అవలంబించాలన్నారు.
కిట్స్ వరంగల్ డ్రగ్స్ ఫ్రీ క్యాంపస్‌ను నిర్వహిస్తోందని అభినందించారు. అంతే కాకుండా కిట్స్ నిపుణుల ఆంటి డ్రగ్ కమిటీ కృషిని కొనియాడారు.
తెలంగాణ ప్రభుత్వ మిషన్ పర్యవేక్షణలో డ్రగ్స్ వ్యతిరేక మిషన్‌లో యువకులు కీలక భాగస్వాములు కావాలని కమీషనర్ అన్నారు. డ్రగ్స్ ఫ్రీ సొసైటీగా, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా సమాజంలో మార్పు తీసుకురావడానికి విద్యార్థులే కీలకమని పేర్కొన్నారు.
మీ కుటుంబ ప్రయోజనం కోసం "మీరు డ్రగ్స్ తీసుకోకండి ఎవరిని ఇందుకు అనుమతించకండి " అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు కిట్స్ వరంగల్ ఛైర్మన్, కెప్టెన్ వి. ల క్ష్మికాంతా రావు, కిట్స్ వరంగల్ కోశాధికారి పి.నారాయణ రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు కిట్స్ అడిషనల్ సెక్రెటరీ, వి. సతీష్ కుమార్ విద్యార్థుల ప్రయోజనం కోసం డ్రగ్ నిరోధక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కిట్స్ వరంగల్ యాంటీ డ్రగ్ కమిటీని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి అధ్య క్షోపన్యాసం చేశారు. డ్రగ్స్ మరియు నార్కోటిక్స్ వాడకం సృజనాత్మకతను మానవ సహజ ఆలోచనలను నశింప చేస్తాయని కంప్యూటర్ సాంకేతికతలకు సంబంధించి నైపుణ్యాలను సులభతరం చేయడానికి అవసరమైన సాంకేతికతలను విద్యార్థి సమూహం అలవాటు చేసుకోవాలన్నారు. ‘చక్కటి వ్యక్తిత్వంపై దృష్టి పెట్టండి’. అదే మన ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి దారి తీస్తుంది. యువత మంచి మనసుతో యోగా అభ్యాసం తో శరీరాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
డ్రగ్స్ నార్కోటిక్స్ వాడకం పై విద్యార్థుల ప్రయోజనం కోసం ఓరియంటేషన్ ప్రోగ్రామ్
నిర్వహించామని సెంట్రల్ జోన్ డిసిపి, షేక్ సలీమా వెల్లడించారు
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి, ఐపిఎస్ షేక్ సలీమా, ఎసిపి డా.ఎం.జితేందర్ రెడ్డి, ఎసిపి, టిజి ఎన్ ఎబి, సైదులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, కెయు పోలీస్ స్టేషన్, సంజీవ్, కిట్స్ వరంగల్ యాంటీ డ్రగ్ కమిటీ కన్వీనర్, ప్రొఫెసర్ కె. శ్రీధర్, , ఇతర సభ్యులు డా. పి. నాగార్జున రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్. ఎం. కోమల్. రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, పోలీసు అధికారులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ & పిఆర్ఓ డాక్టర్ డి. ప్రభాకరా చారి, 400 మంది విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box