తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర

 


*తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర*

*న్యూజెర్సీ ప్రవాసుల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*


తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ'కి చైర్మన్‌గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్ర వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.


ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.  తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీకి చైర్మన్‌గా వ్యవహరించాలని తాను కోరటంతో ఆనంద్ మహీంద్ర అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే వారు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.


తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో  ఏర్పాటైన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుడినే అధినేతగా నియమిస్తామని ముఖ్యమంత్రి ఇటీవల అసెంబ్లీలోనూ ప్రకటించారు. 


ఆనంద్ మహీంద్రా ఇటీవల హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారితో సమావేశమైన సందర్భంలోనూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీపై చర్చలు జరిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు