గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి :: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆదివారం జిల్లా కలెక్టర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
జిల్లా పర్యటనలో భాగంగా రామప్ప సరస్సు, హరిత కార్టేజ్ లను సుందరికరణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గదులను శుభ్రంచేయాలని, శానిటేషన్ చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్లను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఎటువంటి లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా
చేయాలని అధికారులను సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇర్రిగేషన్ సిఈ విజయ భాస్కర్, జెడ్పీ సి ఈ ఓ సంపత్ రావు, డి ఎం అండ్ హెచ్ అప్పయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box