బి.సి న్యాయవాదుల రాష్ట్ర సదస్సు జయప్రదం చేయండి
విస్తృత ప్రచారం చేస్తున్న ఐ ఎల్ పి ఎ నాయకత్వం
బార్ అసోసియేషన్లలో పోస్టర్ ఆవిష్కరణ
సూర్యాపేట, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ కోర్టుల్లో ప్రచారం
బి.సి హక్కుల కోసం చట్టం, న్యాయం, రాజ్యాంగం తెలిసిన బి.సి న్యాయవాదులు పోరాడాలని ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు పొన్నం దేవారాజ్ గౌడ్, సాయిని నరేందర్, మాధవ కృష్ణ, బిక్షమయ్య, పూస మల్లేష్ లు పిలుపునిచ్చారు. బి.సి హక్కుల సాధన ఉద్యమంలో బి.సి న్యాయవాదులను భాగస్వాములను చేయడం కోసం ఈ నెల 25 న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి బి.సి న్యాయవాదుల సదస్సుకు రాష్ట్రంలోని న్యాయవాదులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. గురువారం సూర్యపేట జిల్లా సూర్యాపేట, తుంగతుర్తి, హుజూరునగర్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, మహబూబబాద్ కోర్టులలో న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
సూర్యపేట బార్ అసోసియేషన్ లో బార్ ప్రధానకార్యదర్శి డి మల్లయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా 60 శాతం పైగా జనాభా కలిగిన బి.సి ప్రజలను ఇంకా మనుషులుగా గుర్తించడం లేదని, జనగణన కోసం 70 ఏండ్లుగా ఎన్ని పోరాటాలు చేసినా నేటికీ బి.సి జనాభా లెక్కలు చేయడం లేదని, జనాభా లెక్కలు చేయకుండా బి.సి లకు రిజర్వేషన్లు పెంచి కోర్టులల్లో వీగిపోయేలా చేస్తున్నారని అన్నారు. బ్రిటిష్ కాలంలో జరిగిన జనగణన తర్వాత ఇప్పటికీ జనగణన జరగలేదని, కుల జనగణన, చట్టసభల్లో బి.సి వాటా సాధన ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాల్సిన అవసరముందని ఆయన అన్నారు.
ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో కుల జనగణన - ఒబిసి ల అభివృద్ధి, జనాభా దామాషా ప్రకారం అవకాశాలు - సామాజిక న్యాయం, మహిళా కోటాలో బి.సి మహిళా వాటా, బి.సి ఓటర్ల బానిసత్వం - పాలక వర్గాల ధోరణి అనే నాలుగు అంశాలపై ప్రముఖులైన బి.సి కమీషన్ చైర్మన్ వకులాబరణం కృష్ణ మోహన్, కర్ణాటక హై కోర్టు న్యాయవాది ఎస్ బాలన్, పూనే న్యాయవాది వాసంతి నల్వడా, ప్రొఫెసర్ సింహాద్రి, మధ్యప్రదేశ్ న్యాయవాది వినాయక్ ప్రసాద్, మాజీ అడ్వకేట్ జనరల్ బి ఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ యాదవ్, బి శంకర్, బార్ అసోసియేషన్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్, హై కోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ లాంటి ప్రముఖులు ఈ సదస్సులో బి.సి ల స్థితిగతులు, భవిషత్ ఉద్యమం పట్ల ప్రసంగిస్తారని తెలిపారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షతన తుంగతుర్తి కోర్టులో మంగళవారం జరిగిన సమావేశంలో వారు సదస్సు వాల్ పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. బి.సి సమాజానికున్న ప్రధాన సమస్యలైన కుల జనగణన, దామాషా ప్రకారం వాటా, మహిళా రిజర్వేషన్లలో బి.సి కోటా, చట్టసభల్లో వాటా, రాజకీయాల్లో వాటా అంశాలపై ప్రముఖులైన వకులాభరణం కృష్ణమోహవ్, ప్రొఫెసర్ సింహాద్రి, కర్ణాటక సీనియర్ న్యాయవాది ఎస్ బాలన్, పూనే సీనియర్ న్యాయవాది వాసంతి నల్వాడ, మధ్యప్రదేశ్ కు చెందిన వినాయక్ ప్రసాద్ షా లు ఈ సదస్సులో పాల్గొని విలువైన సందేశాన్ని అందిస్తారని తెలిపారు. ఒబిసి న్యాయవాదులను ఒబిసి సమాజానికి అనుసంధానం చేయడమే ఐ ఎల్ పి ఎ లక్ష్యమని, బి.సి సమస్యల పట్ల బి.సి న్యాయవాదులకు అవగాహాన పెంచడం వల్ల మెజార్టీ పీడిత సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. పాలకవర్గాలు ఉద్దేశపూర్వకంగా మెజార్టీ సమాజానికి అన్యాయం చేస్తూ పాలన కొనసాగిస్తున్నారని, అత్యున్నత న్యాయ వ్యవస్థ కూడా బహుజన సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని అన్నారు. బహుజన న్యాయవాదులు బహుజన సమాజం కోసం పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
మహబూబబాద్ జిల్లా తొర్రూరు కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ రాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. వేల ఏండ్లుగా ఉత్పత్తి, శ్రమలో కీలకపాత్ర పోషిస్తూ సమాజ మనుగడ కోసం ఎంతో కృషి చేస్తున్న బి.సి సమాజం నేడు అన్ని రంగాల్లో అన్యాయానికి గురవుతుందని, ప్రత్యేకించి కీలక రంగమైన జుడీషరీలో బి.సి లకు సముచిత వాటా దక్కడం లేదని, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా సాధన కోసం జరిగే పోరాటంలో బి.సి న్యాయవాదులతో పాటు ఇతర రంగాల్లో ఎదిగిన బి.సి లు ముందుండాలని విజ్ఞప్తి చేశారు.
సామాజికన్యాయ సమరంలో బహుజన న్యాయవాదులను భాగస్వాములను చేసి సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా సాధించడమే లక్ష్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
మహబూబబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టులో సీనియర్ న్యాయవాది కొంపెళ్లి వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కోసం గత 60 ఏండ్లుగా ఎన్ని పోరాటాలు చేసినా పాలక వర్గాలు స్పందించడం లేదని, స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా, స్వేచ్ఛ, సమానత్వం కోసం రాజ్యాంగం వ్రాసుకున్నా 90 శాతం ప్రజలకు ఇంకా న్యాయం జరగడం లేదని అన్నారు. సామాజిక న్యాయ సమరంలో బి.సి సమాజం ఐక్యతగా సాగి చట్టసభల్లో, న్యాయ వ్యవస్థలో వారి వాటా వారు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహబూబబాద్ బార్ అససియేషన్ న్యాయవాదులు మామిడాల సత్యనారాయణ, దాసరి నాగేశ్వరరావు, పుల్లూరి కిష్టయ్య, కె ఆనంద్ కుమార్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, కారింగుల జయపాల్, గౌస్, మందుల శ్రీనివాస్, ఎస్ సునీత, జయకృష్ణ, మున్న, తొర్రూరు బార్ అసోసియేన్ అద్యక్షులు కల్వల ప్రవీణ్ రాజు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి సైదులు, ఏ జి పి బండపల్లి వెంకన్న, సీనియర్ న్యాయవాదులు వల్లపు మహేష్, ప్రేమ్ చందర్, రఘురాం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, లాలు, శ్రీనివాస్, విజయ, పల్లవి, వెంకటేశ్వర్లు, తుంగతుర్తి బార్ అసోసియేషన్ కోశాధికారి బి ప్రతాప్, బార్ మాజీ అధ్యక్షులు జిల్లా కుమారస్వామి, న్యాయవాదులు కుంభం రణధీర్, వంగాల నాగరాజు, వేణురాజ్, సూర్యాపేట జిల్లా నాయవాదులు హస్సేన్, రేగటి శంకరయ్య, వి సత్యనారాయణ పిళ్ళై, కాకి రాంరెడ్డి, కొంప్లెల్లి లింగయ్య, కోక రంజిత్ కుమార్, బి అనిల్, ఎల్ సుభాషిణి, చందన, అశోక్, అనిల్ కుమార్, సుధాకర్, పరమేష్, బాగాల నరసింహ, బి వెంకట్ రత్నం, ఎ వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box