బి సి ల రాజ్యాధికార దిశగా అందరూ పాటుపడాలి.
గోదావరిఖని బార్ లో సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
ఐ ఎల్ పి ఎ కార్యదర్శి ఎన్ జె శ్యాంసన్
జనాభాలో 60 శాతంగా ఉన్న బి.సి లు రాజ్యాధికారం దిశగా
ప్రయాణం చేయాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ ఎల్ పి ఎ) తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎన్ జె శ్యాంసన్ అన్నారు. ఈ మేరకు ఆదివారం గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆవరణ లో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. దేశంలో అత్యధిక జనాభా బి సి. లది అయినప్పటికీ అధికారం అగ్ర వర్ణాల చేతుల్లో కీలు బొమ్మగా మారిందన్నారు. బి సి లంతా ఐక్యమైతే రాజ్యాధికారంతో పాటు మన హక్కులను మనమే సాదించు కోవచ్చన్నారు. స్వాతంత్రం సిద్దించిన నాటి నుంచి బి.సి లను అన్ని వర్గాలు వాడుకొని వొదిలేస్తున్నారన్నారు. బి.సి న్యాయవాదులను చైతన్యం చేసి తద్వారా బి.సి సమాజాన్ని ఐక్యం చేసేందుకు ఐ ఎల్ పి ఏ ఆద్వర్యంలో ఈ నెల 25 న హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ జె ఎన్ టి యు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించే ఓబిసి న్యాయవాదుల సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవ్వాజి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐ ఎల్ పి ఏ నాయకులు సాయిని నరేందర్, జూకూరి మహేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, ఉపాద్యక్షులు రామటెంకి శ్రీనివాస్, బీసీ న్యాయవాదులు వేల్పుల మురళీధర్ యాదవ్, పుర్మా శ్రీనివాస్, ముచ్చకుర్తి కుమార్, రాగం శ్రీధర్, గుర్రాల రాజేందర్, సీతాకారి చంద్ర శేఖర్, వేల్పుల అరుణ్, ముష్కే రవి, సిరిమల్లా అనిల్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box