బి.సి ల వాటా పోరాటంలో బి.సి న్యాయవాదులు ముందుండాలి
హన్మకొండలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఐ ఎల్ పి ఎ నాయకులు
సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బి.సి ల వాటా సాధన పోరాటంలో బి.సి న్యాయవాదులు ముందుండాలని ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు పొన్నం దేవరాజ్ గౌడ్ అన్నారు. బి.సి హక్కుల సాధన ఉద్యమంలో బి.సి న్యాయవాదులను భాగస్వాములను చేయడం కోసం ఈ నెల 25 న హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయి బి.సి న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని హన్మకొండ బార్ అసోసియేషన్ లో హన్మకొండ బార్ ప్రధానకార్యదర్శి లడే రమేష్ అధ్యక్షతన జరిగిన శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా 60 శాతం పైగా జనాభా కలిగిన బి.సి ప్రజలకు ఇంకా న్యాయం జరగడం లేదని, బ్రిటిష్ కాలంలో జరిగిన జనగణన తర్వాత ఇప్పటికీ జనగణన జరగలేదని, కుల జనగణన కోసం రాహుల్ గాంధీ పార్లమెంటులో డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో కుల జనగణన చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి లడే రమేష్, సీనియర్ న్యాయవాదులు పులి సత్యనారాయణ, దయాల సుధాకర్, జంగా స్వప్న, రమాదేవి, రంజిత్ గౌడ్ మాట్లాడుతూ కాకా కలెక్కర్, మండల్ కమీషన్ లాంటివి ఎన్ని నివేదికలు ఇచ్చినా , ఎన్ని పోరాటాలు చేసినా ప్రధాన రంగాలైన న్యాయ వ్యవస్థ, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో నేటికీ బి.సి లకు అన్యాయం జరుగుతుందని అన్నారు. సామాజిక న్యాయ సమరంలో రాజ్యాంగం, చట్టం తెలిసిన న్యాయవాదులు ముందుండాలని, బి.సి సమాజం ఐక్యతగా సాగి చట్టసభల్లో, న్యాయ వ్యవస్థలో వారి వాటా వారు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25 న హైదరాబాద్ లో జరుగు బి.సి న్యాయవాదుల రాష్ట్ర సదస్సును వియవంతం చేయడంలో హన్మకొండ న్యాయవాదులు ముందుండాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్క్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు మాధవ కృష్ణ, సాయిని నరేందర్, నరహరి, వరంగల్ బార్ అససియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జంగా స్వప్న, కార్యనిర్వహక సభ్యురాలు రమాదేవి, మాజీ ప్రదాకార్యదర్శి గునిగంటి శ్రీనివాస్, న్యాయవాదులు పులి సత్యనారాయణ, దయాల సుధాకర్, యుగేందర్, జలజ, బాసాని ఉమాదేవి, గుర్రాల వినోద్ కుమార్, అనిల్ యాదవ్, పాము శరత్, కూనూరు రంజిత్ గౌడ్, రాజేష్, రాజన్ బాబు, రాజ్ కుమార్, సాగర్ గౌడ్, సుందర్ రామ్, జిలకర శ్రీనివాస్, భిక్షపతి, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box