_యమగోల..యమలీల..ఏమి నీ లీల



 *_యమగోల..యమలీల.._*

*_ఏమి నీ లీల!_*

_____________________


(*_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*)

       విజయనగరం

      9948546286


✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽


నవరస నటనా సార్వభౌముడాతడు..

ఎన్టీవోడికి డూపైనా..

తొలినాళ్లలో కొంత

ఆయన రూపైనా..

యముడై ..భీముడై ..

అంతటి నందమూరికే తాతై..

ప్రతినాయక పాత్రకు 

తానే ప్రాణదాతై..

ఘనత వహించిన 

ఎస్వీఆర్ నటవారసుడై..

ఆయన నటించి మెప్పించిన రావణ..ఘటోత్కచ..

సుయోధన పాత్రలకు

తాను మరోపేరై..

విలనిజాన్ని ఉన్నత 

కళనిజంగా..

విషాదాన్ని విశేషంగా..

వినోదాన్ని సశేషంగా 

ఒప్పించి మెప్పించి...

ఇందుగలడందులేడని 

సందేహము లేక 

కైకాల కలకాలం 

నిలిచే పాత్రలెన్నో 

పోషించి..మెప్పించి 

యమలీలను ఒంటి చేత్తో 

అవలీలగ నడిపి

సాంఘిక..చారిత్రక..

జానపద..పౌరాణిక..

కౌబాయ్ సినిమాలలో పాత్రలెన్నో లెస్సగ పోషించి

తెలుగు సినిమా సువర్ణాధ్యాయపు

రారాజుగా వెలుగొందిన సత్యనారాయణా..

వెండి తెరపై నువ్వో ఆర్కు..

నీ మార్కు..ఆ స్పార్కు..

ఒక రకం పాత్రల పోషణలో

నువ్వు మోనార్కు..!


బ్లాక్ అండ్ వైట్ యుగంలో

సిపాయి కూతురితో

అరంగేట్రం..

ఎప్పుడూ లేదు నీ చుట్టూ

మూస పాత్రల చట్రం..

పంచెకట్టు ప్రతినాయకుడు..

టక్కు చేసే టక్కరి..

టాప్ టు బాటం

మ్యాచింగ్ వేస్తూ లాఫింగ్..

ఏం చేసినా నువ్వు కింగ్..

శారదలో అన్నగా 

కంట తడిపెట్టించిన

నీ అభినయం

నవరసనటసార్వభౌమ

బిరుదుకు పూర్తి న్యాయం..!


గంభీరమైన ఆ గొంతు..

నిండైన ఆ రూపు..

అంతటి వికటాట్టహాసం..

ఆకట్టుకునే నటన..

నిరంతర సాధన..

ఇవన్నీ కలిపితే

కైకాల సత్యనారాయణ..!


🙏🙏🙏🙏🙏🙏🙏


విలక్షణ నటుడు..

ఘన చరితకు 

చివరి వారసుడు  

కైకాల సత్యనారాయణ 

జయంతి..

     (25.07.1935)

________________________

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు