మహిళా పోలీస్‌ షూటర్‌ను అభినందించిన సిపి

 


ఇటీవల రాష్ట్రస్థాయి మహిళా ఓపెన్‌ షూటింగ్‌ చాంఫియన్‌ షిఫ్‌లో బంగారు పతకాన్ని సాధించిన మహిళా అసిస్టెంట్‌ సబ్‌`ఇన్స్‌స్పెక్టర్‌ను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా  గురువారం అభినందించారు. 

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో మహిళా అసిస్టెంట్‌ సబ్‌`ఇన్స్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వి.సువర్ణ గత నెల 21వ తేది నుండి 28  వరకు హైదరాబాద్‌లో సెంట్రల్‌ విశ్వవిద్యాలయములో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళా ఓపెన్‌ షూటింగ్‌ చాంఫియన్‌ షిప్‌ పోటీల్లో 50 మీటర్ల రైఫిల్‌ ఫ్రోన్‌ మాస్టర్స్ విభాగంలో 579 పాయింట్లతో విజయం సాధించి బంగారు పతకాన్ని అందుకున్నారు.

  అదే విధంగా గత నెల 15 నుండి 20 వరకు తమిళనాడులో నిర్వహించిన ఆల్‌ఇండియా పోలీస్‌ స్పెషల్‌ మహిళా షూటింగ్‌ పోటీల్లో సువర్ణ తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గోని ఐదవ స్థానంలో నిలిచారు. షూటింగ్‌ పోటీల్లో పతకం గెలుచుకున్న సువర్ణను వరంగల్‌ పోలీస్‌ పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసారు. క్రీడల్లో రాణించే పోలీస్‌ క్రీడాకారులకు తప్పక ప్రోత్సహం అందించడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ కార్యక్రమములో ఆర్‌.ఐ స్పర్జన్‌రాజ్‌, పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్‌ గౌడ్‌ పాల్గోన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు