హనుమకొండ వరంగల్ ప్రాంతాలలో క్షేత్రస్థాయి పరిశీలన
వర్షాలు కురుస్తున్న క్రమంలో వరద నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీవాకడే అధికారులను ఆదేశించారు.
మంగళవారం కాకతీయకాలని ఫేస్ టూ రోడ్ లో కొత్తగా నిర్మించిన బ్రిడ్జి పరిసరాలను పరీశీలించారు. బ్రిడ్జి పైన నీళ్లు నిలిచు ఉండడాన్ని గమనించి నీళ్లు నిలువకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బ్రిడ్జి ప్రాంతంలో నాలాకు అనుకొని ఉన్న చెట్టు ప్రమాదకరంగా ఉందని వెంటనే చెట్టు ను తొలగించాలని డిఎఫ్ఓను ఆదేశించారు.
నగరంలో భారి వర్షాలు కురిస్తే ఇ్బబందులు కలిగే ప్రాంతాలలో కమీషనర్ పర్యటించారు. హనుమకొండ పరిధిలోని జూ పార్కు వెనుక వైపు గల ప్రాంతం, అంబేద్కర్ భవన్, ప్రెసిడెన్సీ స్కూల్, శ్రీ సాయి నగర్ కాలనీ, నయీమ్ నగర్ బ్రిడ్జి, అలంకార్ జంక్షన్, పోతన నగర్ 12వెంట్స్ ప్రాంతం తో పాటు వరంగల్ పరిధిలోని బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంతం, గోపాల స్వామి గుడి ఏరియాలో కమీషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలను ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
సోమవారం కురిసిన వర్షానికి జలమయం ఐన ప్రాంతాల్లో తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాన్సూన్ బృందాలు డి ఆర్ ఎఫ్ సిబ్బంది శానిటేషన్ బృందాలు సమన్వయం తో పనిచేస్తూ వరద నీరు నిల్వ ఉండకుండా చూడాలని కమీషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డా. రాజేష్ డి ఎఫ్ ఓ శంకర్ లింగం ఈ ఈలు రాజయ్య, శ్రీనివాస్ డి ఈ లు రవికుమార్, సంతోష్ బాబు, శివానంద్,అజ్మీర శ్రీకాంత్ రంగా రావు, రవి కిరణ్ శానిటరీ సూపర్ వైజర్ లు సాంబయ్య, భాస్కర్ ఏ ఈలు దొడ్డిపాటి హరికుమార్, రాగి శ్రీకాంత్, హబీబ్ ఎస్ ఐ లు గోల్కొండ శ్రీను కరుణాకర్ శ్యామ్ రాజ్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box