జిల్లా ప్రజలు పఅప్రమత్తంగా గా ఉండాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద కోరారు.
ఆదివారం అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి వరంగల్ నగరంలోని
ఫాదర్ కొలంబో. ఎన్ ఎన్ నగర్, ఎన్టీఆర్ నగర్, రామన్నపేట, బొంది వాగు. సంతోష్ మాత గుడి వెనుక భాగం, పోతన నగర్, దేశాయిపేట, చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతాలను పరిశీలించారు.
చిన్న వడ్డేపల్లి చెరువులో చేపలు పడుతున్న వారిని గమనించి ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, చెరువులో చేపలు పట్టకుండా, జనం విహారయాత్రలకు వచ్చి సెల్ఫీలు దిగి ప్రమాదాలకు గురికాకుండా పోలీసు నిఘా ఉంచాలని వెంటనే కలెక్టర్ పోలీస్ అధికారులను చరవాణిలో ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
నిత్యం అప్రమత్తం ఉంటూ,
అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తరలించాలని,
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని తహసిల్దార్లు, అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో గతం గతంలో మాదిరేగా పునరావస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని తాసిల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్, ఖిలా వరంగల్, తాసిల్దార్లు ఇక్బాల్, నాగేశ్వరరావు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box