ఉధృతంగా దూకుతున్న భొగతా జలపాతం చూసేందుకు సందర్శకులకు అనుమతి నిలిపి వేత
భారి వర్షాలకు భొగతా జలపాతం ఉధృతంగా దూకుతూ సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. దాంతో సందర్శకులు వందలాదిగా చూసేందుకు తరలి వస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ అనందించడమే కాక నదిలో ఈత కోసం ఉత్సహ పడుతున్నారు. నీటి ప్రవాహం ఉధృతి వేగంగా ఉండడంతో ఈత కోసం దిగే వారి ప్రాణాలకు ముప్పు కలుగుతోంది.వరంగల్ నగరానికి చెందిన జస్వంత్ అనే ఇంజనీరింగ్ మొ దటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి స్నేహితులతో కల్సి భొగతా జలపాతానికి వెళ్లి సెల్ఫీలు దిగి ఈత కోసం వాగులో దిగి గల్లంతయ్యాడు. అతని మృత దేహాన్ని గజ ఈతగాళ్లు వెదికి బయటకు తీసారు. ఈ సంఘటన తర్వాత అధికారులు బొగతా జలపాతానికి సందర్శకులను నిలిపి వేసారు.
బొగతా జలపాతం దగ్గర సందర్శకుల కోసం గట్టి ఏర్పాట్లు చేసినప్పటికి ఇాలంటి సంఘటనలు జరగడం భాదాకరంగా మారింది. సందర్శకులను అదుపు చేసేందుకు వాగు పక్కన బారికేట్లు కూడ నిర్మించారు. అయినా వాటిని దాటుకు వెళ్లి సెల్ఫీలు దిగి లేదా ఈత కెళ్ళి ప్రమాదాలకు గరవుతున్నారు. గతంలో కూడ వర్షాకాల సమయంలో యువకులు ప్రమాదాలకు గురయ్యారు.
సందర్శకులను నియంత్రించడం చాలా ఇబ్బందిగా మారిందని అటవి శాఖ అధికారి ఒకరు తెలిపారు. అందుకే అనుమతి నిలిపి వేయాల్సి వచ్చిందని వర్షాలు ముగిసిన తర్వాత జలపాతం ఉధృతి తగ్గిన అనంతరం సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు. సందర్శకులు ఎవరూ రావద్దని కోరారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box