పోలీస్ శాఖలో కుల వివక్ష సిగ్గు చేటు - డాక్టర్ విశారదన్ మహారాజ్

 


*పోలీస్ శాఖలో కుల వివక్ష సిగ్గు చేటు - ఈ కుల వివక్ష పోవాలంటే బహుజనుల రాజ్యాధికారమే మార్గం*


*ఎస్ ఐ ఆత్మ హత్యకు కారణం అయిన సి ఐ జితేందర్ రెడ్డి పై హత్యా నేరం కేసు నమోదు చేయాలి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు డిమాండ్*


*సమగ్ర విచారణ జరిపి సి ఐ నీ పదవి  నుండి శాశ్వతంగా తొలగించాలి*


*ఎస్సి, ఎస్ టి అట్రాసిటీ చట్టాన్ని పగడ్బందిగా అమలు చేసి దోషులందరినీ కఠినంగా శిక్షించాలి* 


ఎస్ ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మ హత్యకు కారణం ఐన అశ్వరావు పేట సీ ఐ జితేందర్ రెడ్డి మరియు కానిస్టేబుళ్ల పై హత్యా నేరం మరియు ఎస్ సీ, ఎస్ టీ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ పార్థివ దేహం వారి స్వగృహానికి చేరుకోగానే వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించిన విశారదన్ గారు ప్రెస్ నోట్ విడుదల చేసారు. స్వాతంత్య్రo వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నప్పటికి దేశంలో, రాష్ట్రంలో కుల వివక్ష కొనసాగడం సిగ్గు చేటని అన్నారు. అందుకే ఎస్ సీ, ఎస్ టి, బీ సీ, మైనార్టీలకు రాజ్యాధికారం సాధిస్తేనే ఈ కుల వివక్ష పోతుందని అని అన్నారు.

శ్రీనివాస్ మరణం తట్టుకోలేక వారి మేనత్త కూడా గుండె పోటుతో మరణించడం విషాదకరం అని అన్నారు.

వారి ఇంటికి వెళ్లి వారి పార్థివ దేహాలకు శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో డీ ఎస్ పి పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా రీజియన్ ఇన్చార్జి మేకల సుమన్ గారు, వరంగల్ జిల్లా కమిటీ నాయకులు దామెర శ్రావణ్, కట్కూరి సునీల్, గాదె పూర్ణ చందర్, సంగాల శివకృష్ణ, సిలువేరు రవీందర్, మల్లయ్య, స్వామి తదితరులు ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు