▪️కుడా ఛైర్మెన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంకట్రామి రెడ్డి
▪️శుభాకాంక్షలు తెలియజేసిన మేయర్ శాసనసభ్యులు వైస్ చైర్మన్...
హన్మకొండ,08 జూలై 2024 :నగరాన్ని బెస్ట్ సిటీ గా తీర్చిదిద్దడమే ధ్యేయమని కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి అన్నారు.
ఈ సందర్భం గా బాధ్యతలు చేపట్టిన కుడా ఛైర్మెన్ కు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, కిసాన్ మోర్చా సెల్ జిల్లా అధ్యక్షులు పింగిలి వెంట్రాం నరసింహ రెడ్డి, కుడా వైస్ ఛైర్మెన్ డా.అశ్విని తానాజీ వాకడే ఇతర ఉన్నతాధికారులు పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భం గా నిర్వహించిన మీడియా సమావేశం లో కూడా ఛైర్మెన్ మాట్లాడుతూ ఈ పదవి రావడానికి సహకరించిన కాంగ్రేస్ పార్టి నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యుల తో పాటు జిల్లా మంత్రులు వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
వరంగల్ నగరాన్ని బెస్ట్ సిటీ గా మార్చడమే తన ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు (ఓ ఆర్ ఆర్)తో పాటు ఎయిర్ పోర్ట్, రోడ్లు పూర్తి చేయడం ప్రధాన అంశాలుగా స్వీకరించడం జరుగుతుందని, తనకు పదవి రావడం లో కార్యకర్తలు జిల్లా నాయకుల సహకారం మరువలేనిదని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
----
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box