తెలంగాణ వ్యాప్తంగా ్మరుడు దొడ్డి కోమురయ్య 78 వ వర్దంతి నిర్వహించారు. ఆయన విగ్రహాలుకు టిత్రపటాలకు అధికారులు ప్రజా ప్రతినిధులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఉద్యమ కారుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 78 వ వర్ధంతి సందర్బంగా జనగాం జిల్లా కేంద్రంలోని కళ్లెం రోడ్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రాష్ట్ర రోడ్, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాంలో పాల్గొన్నారు.
నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, కురుమ సంఘ నేతలు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన దొడ్డి కొమురయ్య జీవిత చరిత్ర నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
గురువారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు , తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 78 వ వర్ధంతి సందర్బంగా జిల్లా బీ.సీ. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని కాన్ఫెరెన్స్ హాల్ లో వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరై ముందుగా... దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... దొడ్డి కొమురయ్య జనగాం జిల్లా వాస్తవ్యుడని ..
ఒక సాధారణ కుటుంబం లో పుట్టిన దొడ్డి కొమురయ్య చేసిన త్యాగాలను, పోరాటాలను ప్రభుత్వం గుర్తించి ఈరోజు రాష్ట్రామాంతట పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టిందన్నారు
1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ..నిజాం సంస్థానం లోని ప్రజలకు స్వేచ్ఛ లేకుండపోవడం తో.. వెట్టి చాకిరి కి,దోపిడికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం లో దొడ్డి కొమురయ్య తొలి అమరుడు అని... ఆయన చేసిన త్యాగం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో మొదటి అధ్యాయమన్నారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, బీసీ సంక్షేమ అధికారి రవీందర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కుర్మ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.
.......ఎండ్స్
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box