ఎపి సిఎం లేఖకు తెలంగాణ సిఎం జవాబు - ఓకే మాట్లాడుకుందాం



CM Revanth Reddy Return Reply to Chandra Babu Naidu

ఏపీ సీఎంకు జవాబు ఉత్తరం రాసిన తెలంగాణ సీఎం

సమస్యలను పరిష్కరించుకుందామన్న మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని వెల్లడి

మహాత్మా జ్యోతిరావు పూలే భవనంలో (పాత కెసిఆర్ అడ్డాలో) కలుద్దామన్న తెలంగాణ సీఎం

ఏపీలో చంద్రబాబు నాయుడు విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి


విభజన అంశాలపై చర్చించుదామంటూ లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బదులిచ్చారు.   చంద్రబాబు చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తూ ఆయన ఈరోజు ప్రత్యుత్తరం రాశారు. ఈ నెల 6న చర్చించుదామన్న చంద్రబాబు ప్రతిపాదనకు సానుకూలంగా ఓకె చెప్పారు.  చర్చలకు ఏపీ సీఎంను సాదరంగా ఆహ్వానించారు. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నానని... పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. 


తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవనంలో కలుద్దామని తెలిపారు.


నిన్న మీరు పంపిన లేఖ అందిందని... దానిని చదివానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొదటగా ఏపీలో విజయం సాధించినందుకు కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతికొద్ది మందిలో మీరు ఉన్నారని ప్రశంసించారు.


అదీ సంగతి వీరిద్దరి భందం అందరికి తెల్సిందే..ఇప్పటికే బిఆర్ఎస్ శ్రేణులు ట్రోలింగ్ మొదలు పెట్టాయి. గురు శిష్యులను  బిఆర్ఎస్ పార్టి సోషల్  మీడియాలో ఓ ఆట ఆడుకుంటోంది.

చంద్రబాబు కన్నా ముందు తెలంగాణ లో రేవంతరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రేవంతరెడ్డి ప్రమాణ స్వీకారానికి బాబు రాలేదు. బాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి పోలేదు. ఎక్కడో ఇద్దరు కలిసే ఉంటారని ఊహగానా చర్చలు జరిగాయి.

ఇప్పుడు ఆఫీసియల్ గా ఇద్దరు కల్సుకునే ఛాన్స్ వచ్చింది. ఇద్దరి బంధం పక్కన పెడితే రెండు రాష్ట్రాల మధ్యన విభజన సమస్యలు చాలా ఉన్నాయ్. పదేండ్ల కాలంలో పరిష్కారం ఎందుకు కాలేదో తెలంగాణ ప్రజలకు తెల్సు. ఇప్పుడు పరిష్కారమైతే సంతోషమే. కానీ మళ్ళీ కుట్రలు కుతంత్రాలకు తెరలేపితే సీన్ రివర్స్ అయిద్ది. ఈ చర్చలకు వెళ్లేముందు రేవంత్ రెడ్డి నిపుణులతో మంత్రివర్గ సహచరలతో విపక్ష నేతలతో సమగ్రంగా చర్చ జరిపితే బాగుంటుంది.

---ends


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు